- మైనస్ 12 డిగ్రీల సెల్సియస్‌లో షూటింగ్
- “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటిస్తున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. సీనియర్ నటులు అర్జున్ , శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విశాల్-శేఖర్ సంగీత సారథ్యంలో ఇటీవల సైనిక పాటని విడుదల చేసిన చిత్ర బృందం.. ఫిబ్రవరి 14న రెండో పాటని విడుదల చేయబోతున్నారు. అంతేగాకుండా, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ భారత సరిహద్దులో.... అది కూడా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్‌లో చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ''నా పేరు సూర్య టీజర్ చూసిన వారంతా వావ్ అంటూ... ప్రశంసల జల్లు కురిపించారు. టీజర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేషన్ గురించి, మేకోవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. భావోద్వేగమైన సైనిక సాంగ్ ప్రతీ ఒక్క మనసును కదిలించింది. మేకింగ్ వీడియో సినిమా స్టామినాను చూపించింది. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 14న మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నాం. మరో వైపు ఈ చిత్ర షూటింగ్ భారత సరహద్దులో క్లిష్ణమైన ప్రదేశాల్లో జరుగుతోంది. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్‌లో ఈ షూటింగ్ చేస్తున్నాం. ఒరిజనల్ గా మన సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతారో...మా హీరో అల్లు అర్జున్ సైతం... సినిమా మీదున్న భక్తితో... ఒరిజినల్ లొకేషన్స్‌లో షూటింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోయినా... సహజత్వం కోసం షూటింగ్ చేస్తున్నారు. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను మా దర్శకుడు వక్కంతం వంశీ పకడ్భందీగా ప్లాన్ చేశారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.