రాష్ట్రంలో అత్యంత ప్రభావిత,ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించిన ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువు విధించి వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు.ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో అత్యంత ప్రభావిత,ప్రాధాన్యత ప్రాజెక్టులుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈ విధంగా గుర్తించిన ప్రతి ప్రాజెక్టుకు ఒక నిర్ణీత గడువు విధించి ఆగడువులోగా సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక ఆయా ప్రాజెక్టుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పాలోఅఫ్ చేస్తూ పనులు వేగవతంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గత సమావేశం నుండి ఇప్పటి వరకూ ఈప్రాజెక్టుల పురోగతిలో అనుకున్నంత ప్రగతి లేదని కావున హై ఇపాక్ట్ అండ్ ప్రయారిటీ ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్ దినేష్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు.ముఖ్యంగా హై ఇంపాక్ట్,ప్రయారిటీ ప్రాజెక్టులుగా గుర్తించిన ఎకనమిక్ సిటీలు,జక్కంపూడి ఎకనమిక్ సిటీ,అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ రహదారి,బీచ్ కారిడార్,విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్,ఎంఎస్ఎంఇ క్లస్టర్ల అభివృద్ధి,విశాఖపట్నంలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు.అలాగే ప్రమోషన్ ఆప్ స్టార్టప్ ఇకోసిస్టమ్,విశాఖపట్నంలో ప్రమోషన్ ఆఫ్ ఫిన్టెక్ వ్యాలీ,ఎవిజిసి ఫిల్మ్ అండ్ మీడియా సిటీ,కోల్డు చైన్ కార్పొరేషన్ ఏర్పాటు,మైక్రో ఇరిగేషన్ కింద సాగు విస్తీర్ణత పెంపొందించడం,ఇకో-టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి,ఉన్నత విద్యకు సంబంధించి ఐఐటి,ఎన్ఐటి,ఐఐయం,కేంద్రీయ,గిరిజన విశ్వవిద్యాలయాలు తదితర ఏడు ప్రాధాన్యత ప్రాజెక్టులపై సిఎస్ దినేష్ కుమార్ సమీక్షించారు. అదేవిధంగా గత నాలుగేళ్లుగా నిర్వహించిన పార్టనర్ షిప్పు సమ్మిట్లు,ఇతర సందర్భాల్లోను వివిధ కంపెనీలు,సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు)అన్నిటినీ పూర్తిగా కార్యాచరణలోకి తీసుకువచ్చేందుకు ఆయా శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.అంతకు ముందు ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త హై ఇంపాక్ట్ ప్రయారిటీ ప్రాజెక్టులు వాటి ప్రగతి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.అలాగే సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు వారి వారి శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు.ఈసమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరుబ్ కుమార్ ప్రసాద్, ఇంధన,మౌళిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్ధ జైన్,ఎపిఐఐసి ఎండి బాబు ఎ, ప్రన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రిజ్వి,ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.