YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి: కేంద్ర ఆర్థికశాఖ

 బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి: కేంద్ర ఆర్థికశాఖ

బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ వరుస సెలవులపై సోషల్ మీడియాలో హల్‌చల్ నడుస్తున్న నేపద్యం లో కేంద్ర ఆర్దిక శాఖా స్పందించింది. సెలవులు, పండుగలు ఆపై ఆర్బీఐ సమ్మె కారణంగా సెప్టెంబర్ మొదటివారంలో ఐదారు రోజులు బ్యాంకులు పనిచేయవని ఓ వదంతి వ్యాపించింది. అయితే ఇందులో నిజం లేదని, బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ ఆదివారం, 8వ తేదీ శనివారం మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుందని, జన్మాష్టమికి అన్ని రాష్ట్రాల్లో సెలవు లేదని తెలిపింది. సెలవు రోజుల్లో కూడా అన్ని రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నది. ఈ వదంతి వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కలుగుతున్నాయని తెలిపింది.

Related Posts