YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వొడాఫోన్‌, ఐడియా విలీనం

వొడాఫోన్‌, ఐడియా విలీనం
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్‌, ఐడియా విలీనం ఎట్టకేలకు పూర్తయింది. ఈ విషయాన్ని రెండు కంపెనీలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశాయి. రెండు టెలికాం సంస్థలు విలీనం కావడంతో 408 మిలియన్‌ చందాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ ఆవిర్భవించింది. వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ కొత్త బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉండనున్నారు. వారిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉండగా.. కుమార మంగళం బిర్లా ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ బోర్డుకు బాలేశ్‌‌ శర్మ(వొడాఫోన్‌ ప్రస్తుత సీఈవో ) సీఈవోగా నియమితులైనట్లు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకు భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా భారతీ ఎయిర్‌టెల్‌ ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ ఆక్రమించింది. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ నిలవనుంది. టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో రాకతో సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. వొడాఫోన్‌ ఐడియా విలీనంతో ఏడాదికి రూ.14వేల కోట్ల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఈ రెండు కంపెనీల రుణాలు జూన్‌ 30, 2018 నాటికి 1.09లక్షల కోట్లుగా ఉన్నాయి. కంపెనీల విలీనం కోసం టెలికాం శాఖకు ఏకకాల స్పెక్ట్రామ్‌ ఛార్జిల కింద రూ.3,900కోట్ల నగదు, రూ.3,300కోట్లకు బ్యాంక్‌ గ్యారెంటీలీను సమర్పించినట్లు సంస్థ వెల్లడించింది.
విలీనం అధికారికంగా పూర్తి కావడంపై వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా హర్షం వ్యక్తం చేశారు. నేడు మేము భారత్‌లోనే అతిపెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించాం. ఇది నిజంగా చారిత్రాత్మక విషయం’ అని ఆయన పేర్కొన్నారు. విలీనం పూర్తి కావడంతో ప్రస్తుతం ఐడియా కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.

Related Posts