YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రూపాయి..ఢమాల్

 రూపాయి..ఢమాల్
దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా రూపాయి ప‌త‌న‌మైంది.డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. కేవ‌లం ఈ ఒక్క‌వారంలోనే రూపాయి విలువ భారీగా క్షీణించింది. వారం ప్రారంభంలో 70.10 ఉన్న రూపాయి ఇపుడు 71.10 మార్కుని దాటింది. ముడి చమురు ధరలు కొండెక్కడంతో.. అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో రూపాయి 26 పైసలు క్షీణించి తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. అన్ని ఆసియా కరెన్సీలు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ... ఈరోజు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య భయాలు కూడా దేశీయ కరెన్సీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.97 వద్ద ట్రేడవుతోంది. పండుగ‌ల సీజ‌న్ వల్ల బంగారం దిగుమ‌తులు మరింతగా పెరిగే అవ‌కాశముంది. దీంతో బంగాంర ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Related Posts