YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీయేతర ప్రభుత్వంపై సీఎం ల చర్చ బెజవాడలో కుమారస్వామి, చంద్రబాబు భేటీ

 బీజేపీయేతర ప్రభుత్వంపై  సీఎం ల చర్చ బెజవాడలో కుమారస్వామి, చంద్రబాబు భేటీ
దుర్గమ్మ దర్శనం కోసం బెజవాడ వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘హోటల్ గేట్‌వే’లో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. జాతీయ పార్టీలతో మరోసారి సమావేశం నిర్వహించే విషయం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. దక్షిణాదిలోని పార్టీలను కలుపుకొని ముందుకెళ్లే విషయమై సమాలోచనలు చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా పని చేసే పార్టీలను కలుపుకొని వెళ్తామని బాబు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నేత అన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. విజయవాడ వచ్చిన కుమారస్వామి సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సీఎం దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కుమార స్వామి మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. ప్రజలంతా సుఖ శాంతులతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. సీఎం చంద్రబాబుపై కూడా పొగడ్తలుకురిపించారు కుమార స్వామి. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు సలఫలమయ్యారని.. 17 పార్టీలను ఒకే వేదికపై తీసుకొచ్చారని ప్రశంసించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. టీడీపీతో తమకు సోదర భావం ఉందన్నారు. చంద్రబాబుతో సమావేశంలో కూడా తాజా రాజకీయాలతో పాటూ.. పలు కీలక అంశాలపై చర్చించామన్నారు. కేంద్రంపై చంద్రబాబు నాయకత్వంలో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు కుమార స్వామి. భవిష్యత్‌లో వీలైనన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యమని.. ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తన 100 రోజుల పాలనపై కూడా కర్ణాటక సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.. కుమార స్వామితో చంద్రబాబు భేటీ సమావేశం సందర్భంగా.. ఆయన వెంట మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Related Posts