తూర్పు గోదావరి జిల్లాలో ఆహార పదార్థాల్లో కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. ఎక్కువగా పాలు, నెయ్యి కల్తీ జరుగుతోంది. టీ పోడిలో ప్రమాదకర రసాయనాలు, రంగులు కలుపుతున్నట్లు ఇటీవల తనిఖీల్లో బయటపడింది. పండ్ల వ్యాపారులు కృత్రిమ పద్ధతుల్లో ప్రమాదకరంగా ముగ్గబెడుతున్నట్లుగా పలు సందర్భాల్లో గుర్తించి కేసులు నమోదు చేశాం. మా శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ముమ్మరంగా తనిఖీలు చేయలేక పోతున్నాం.వాహన సదుపాయం లేకపోవడంతో బస్సులోనే వెళ్లి తనిఖీలు చేయాల్సి వస్తోంది. సరిపడా సిబ్బంది, వాహన సదుపాయం ఉంటే మరింత సమర్థంగా పని చేసి కల్తీలేని ఆహారాన్ని ప్రజలకు అందించేలా చూస్తాం. దీంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కల్తీల నిరోధానికి యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టలేకపోతోంది. ఆహార కల్తీ తనిఖీ అధికారుల కొరత దీనికి ప్రతిబంధకంగా మారుతోంది. దీంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. పిండి వంటలకు వాడే నూనెలు, పాలు, నెయ్యితో పాటు పప్పు దినుసులు, కారం పొడి, పూజా సామగ్రిలోనూ కల్తీలకు పాల్పడుతున్నారు. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాలో నిత్యం రూ 50 కోట్లకు పైగా విలువైన ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుంటాయి. వీటిలో 30 శాతం ఆహార పదార్థాలు కల్తీల బారినపడుతున్నాయి. జిల్లాలో ఆహార తనిఖీ అధికారులు ముగ్గురే ఉండడంతో పర్యవేక్షణ కష్టతరంగా మారింది. ఆహార నియంత్రణ విభాగంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను మూడు డివిజన్లుగా ఏర్పాటు చేశారు.వీటికి ఒక్కో తనిఖీ అధికారి ఉన్నారు. డివిజన్-1లోని కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం తదితర నగరాలతో కలిపి మొత్తం 15 మండలాలు, డివిజన్-2లో తుని, ఏజెన్సీ ప్రాంతాల్లోని 27 మండలాలు, డివిజన్-3లో కోనసీమ చుట్టుపక్కల 22 మండలాలను వీరు పర్యవేక్షించాల్సి ఉంది ఆహార కల్తీ నియంత్రణ, దుకాణాల తనిఖీలు, ఆహార పదార్థాల్లో కల్తీ నియంత్రణకు నమూనాలు సేకరించడం, వాటిని ప్రయోగశాలకు పంపి నిర్ధారణ అయిన తరువాత క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంది. ఈ విధుల నిర్వహణ వీరికి తలకుమించిన భారంగా మారడంతో సత్ఫలితాలు సాధించలేక పోతున్నారు. జిల్లాలో గత రెండేళ్లలో కల్తీ వ్యాపారులపై 63 కేసులు మాత్రమే నమోదు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. 2017-18లో వివిధ ఆహార విక్రయాలకు సంబంధించి నిర్వహించిన దాడుల్లో 186 నమూనాలను తనిఖీ అధికారులు సేకరించారు. వాటిలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయి కేసులు నమోదు చేసింది 40 మాత్రమే.ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో మొత్తం 145 ఆహార నమూనాలు సేకరించారు. వాటిలో 23 నమూనాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే కారంలో రంపపు పొడి, రంగును కలిపి రంగు విక్రయిస్తున్న ముఠాను గతంలో ఆహార తనిఖీ అధికారులు పట్టుకున్నారు.