YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీని ఆటడేసుకున్న సామ్నా

మోడీని ఆటడేసుకున్న సామ్నా
డిమానిటైజేషన్ అనే విఫల ప్రయోగం ద్వారా దేశాన్ని ఆర్థిక అరాచకంలోకి నెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారని శివసేన ప్రశ్నించింది. చెలామణిలో ఉన్న పెద్దనోట్లలో డిమానిటైజేషన్ తర్వాత 99.3శాతం కరెన్సీ బ్యాంకులకు తిరిగి చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం అధికార ఎన్డీయే భాగస్వామి పక్షమైన శివసేన ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినా దేశ పాలకులు మాత్రం అద్భుతమైన అభివృద్ధి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు అని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్నది. నోట్లరద్దు తర్వాత 2016 నవంబర్‌లో గోవాలో జరిగిన సభలో మోదీ చెప్పిన మాటల్ని ఉదహరిస్తూ.. తనకు 50రోజుల గడువివ్వాలని, ఆ తర్వాత కూడా తన ఉద్దేశంలోకానీ, తన చర్యల్లోకానీ ఏదైనా తప్పు కనిపిస్తే దేశప్రజలు విధించే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని మోదీ చెప్పారు.
మరి అది విఫలప్రయోగమని నిర్ధారణ అయ్యాక.. ఆయన ఇప్పుడు తనకు తాను ఏ శిక్ష విధించుకుంటారు? అని ప్రశ్నించింది. నకిలీ కరెన్సీకి, నల్లధనానికి, అవినీతికి డిమానిటైజేషన్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రధాని పదే పదే చెప్పారని, కానీ గడిచిన రెండేండ్లలో అవి విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించింది. నోట్లరద్దుతో కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు పూర్తిగా సమసిపోతాయనడం పూర్తిగా అసత్యమని తేలిందని శివసేన పేర్కొన్నది. డాలర్‌తో రూపాయి మారక విలువ 70ఏండ్ల కనిష్ఠానికి పడిపోవడం కూడా నోట్లరద్దు దుష్పరిణామమేనని వ్యాఖ్యానించింది. అనాలోచిత నిర్ణయం ఫలితంగా కొత్త నోట్ల ముద్రణకు రూ.15వేల కోట్లు, వాటి పంపిణీకి మరో రూ.రెండువేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయాల్సి వచ్చింది. ఏటీఎంలో సాంకేతిక మార్పులకుగాను మరో రూ.700కోట్లు వెచ్చించింది.మొత్తంగా నోట్లరద్దు కారణంగా దేశం 2.25లక్షల కోట్ల వరకు నష్టపోయింది. ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే ఈ చర్యను ఆపలేకపోయినందుకు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌ను బోనులో నిలబెట్టాలి అని తీవ్రంగా దుయ్యబట్టింది. నోట్లరద్దు అరాచకం తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ప్రభుత్వం చెబుతుండడం.. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి ఉదంతాన్ని గుర్తు చేస్తున్నది అని సామ్నా ఏకిపారేసింది.

Related Posts