YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సమాజ్ వాదీ పార్టీలో చీలికలు

సమాజ్ వాదీ పార్టీలో చీలికలు

రాజకీయాల్లో యుద్ధ తంత్రాలు మామూలుగా ఉండవు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వారిలో చీలిక తెచ్చి వీక్ చేయడం ఒక ఎత్తుగడ. అలాగే పత్యర్థులు చీలిపోతే లాభంతో ఛీర్స్ చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటేనే హస్తిన పీఠం సులువుగా అందుతుందన్నది అందరికీ తెలిసిందే. యూపీలో బలంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీలో చీలిక తెస్తే, విపక్షం వీక్ అవుతుందన్నది కమలనాధుల అంచనా. ఇందుకు ములాయం సింగ్ సోదరుడ శివపాల్ యాదవ్ దొరికారు. గత కొంతకాలంగా అఖిలేష్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న శివపాల్ యాదవ్ తొలుత బీజేపీలో చేరాలని భావించారట. అందుకు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారు. అయితే మారిన పరిస్థితుల్లో శివపాల్ యాదవ్ బీజేపీలో చేరేకంటే కొత్త పార్టీ పెడితేనే తమకు కలసి వస్తుందని భావించిన కమలనాధులు అమర్ సింగ్ ను రంగంలోకి దించారంటున్నారు. అమర్ సింగ్, శివపాల్ మంచి స్నేహితులు కావడంతో ఆయన ప్రోద్బలంతోనే శివపాల్ యాదవ్ సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా పార్టీని ప్రకటించారన్న టాక్ బలంగా విన్పిస్తుంది. శివపాల్ కు యూపీలోని కొన్ని నియోజకవర్గాల్లో పట్టుంది. క్యాడర్ లోనూ గ్రిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే శివపాల్ ద్వారా ఓట్ల చీలిక తెచ్చి కమలం లబ్ది పడాలని భావిస్తుందంటున్నారు. మరి యూపీలో ప్రధాన పార్టీల ఎత్తులు, పైఎత్తులు ఎవరికి లాభిస్తాయో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదుఅందుకే అధికార భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వెళుతున్నాయి. తనకు పెద్దగా బలం లేదని భావించిన కాంగ్రెస్ ఇచ్చిన అరకొర సీట్లు తీసుకుని మహాకూటమిని ఏర్పాటు చేసి మోదీని దెబ్బతీయాలన్న వ్యూహంలో ఉంది.ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం పదే పదే మహాకూటమిని ప్రస్తావిస్తున్నారు. యూపీలో జరిగిన ఉప ఎన్నికలను ఐక్యంగా కైవసం చేసుకోవడంతో అదే ఫార్ములాతో లోక్ సభకు వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ పార్టీలు కలసి యూపీలో మహాకూటమినిన ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు కుదుర్చడంలో ప్రధాన భూమిక పోషించిన ప్రియాంక గాంధీ సయితం ఇరు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు వస్తున్నాయిఅయితే ఇది గమనించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం అలెర్ట్ అయింది. పార్టీ అంతర్గత సర్వేల పరంగా చూసుకున్నా, ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూసుకున్నా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలో ఎదురుగాలి వీయడం ఖాయమని భావిస్తున్నారు. ప్రధాన పోటీ తామే ఇచ్చినప్పటికీ కొద్దిపాటి తేడాతో దాదాపు ఇరవై నుంచి 30 స్థానాలు మహాకూటమి కారణంగా కోల్పోవాల్సి వస్తుందన్న కంగారు మొదలయింది. అందుకే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆపరేషన్ యూపీని అప్పుడే ప్రారంభించారని చెబుతున్నారు.

Related Posts