YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అద్దంలా ఆర్ధర్ జైలు

 అద్దంలా ఆర్ధర్ జైలు

బ్యాంక్ లకు పంగనామాలు పెట్టి వేలకోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు దర్జాగా చెక్కేసిన దొరలను వెనక్కు రప్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు నానాపాట్లు పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దేశం దాటేటప్పుడు నిఘా వ్యవస్థలు నిద్దుర పోవడంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. వచ్చే ఎన్నికల్లో జనం ముందుకు ఓట్ల కోసం క్యూ కట్టాలిసిన పరిస్థితి. వారు ఇలాంటి బాగోతాలు నిలదీస్తే సమాధానం చెప్పుకోలేని దురవస్థ. అందుకే ఎలాగైనా ఒకరిద్దరినైనా భారత్ రప్పించి ప్రజల ముందు చూశారా మా ఘనత అని చాటుకొనే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం లిక్కర్ కింగ్ విజయ మాల్యా వెంటపడింది. ఆయన్ను లాక్కొచ్చే బాధ్యత సిబిఐ పై బలంగా మోపింది. ఎందుకంటే మాల్యా ఆచూకీ పూర్తిగా తెలియడం తో లండన్ లో కోర్టు ద్వారా వత్తిడి మొదలు పెట్టింది.భారత్ లో జైల్లో ఉండటం అంతటి నరకం మరేమి ఉండదని, అక్కడ గాలి వెలుతురు సక్రమంగా ఉండవంటూ లిక్కర్ కింగ్ కోర్ట్ కి చెప్పారు. వెంటనే న్యాయస్థానం సిబిఐ ని విజయ మాల్యా ఉండబోయే జైలు వీడియో తీయాలని చెప్పడం తెలిసిందే. ఇప్పటికే సిబిఐ ముంబయిలోని ఆర్ధర్ జైలు బ్యారక్ 12 వీడియో తీసి రెండుసార్లు లండన్ కోర్ట్ కి పంపినా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో మూడో సారి ఇంకో వీడియో తీసి పంపింది భారత విదేశాంగ శాఖకు పంపింది సిబిఐ.ఆర్ధర్ జైలు మొత్తం కొత్త రంగులు అద్దారు. ముఖ్యంగా బ్యారక్ నెంబర్ 12 మరింత సుందరంగా ముస్తాబు చేశారు. టాయిలెట్ లో టైల్స్ తో బాటు వెస్ట్రన్ కమౌట్ ఏర్పాటు చేశారు. విజయమాల్యా వస్తే ఉంచే బ్యారక్ పక్కనే మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజబల్ వుంటున్నారు. ఈ వీడియో లో అన్ని బావున్నాయని చూపేందుకు 45 మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేశారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులు చూసి అక్కడి ఖైదీలు విస్తు పోతున్నారు. బ్యాంక్ దొంగలకు ఇంత గౌరవం ఉంటుందా అని అటు జైల్లోనూ ఇటు సోషల్ మీడియా లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది.వాస్తవానికి విజయ మాల్యా భారత్ తిరిగి రావడం రాకపోవడం ఆయన ఇష్టమే. అలా బ్రిటిష్ చట్టాలు ఆయనకు రక్షణ కల్పిస్తున్నాయి. కానీ ఇటీవల కేంద్రం ఆర్ధిక నేరగాళ్ళ విషయంలో చేసిన కొత్త చట్టం లిక్కర్ కింగ్ కి దడపుట్టించింది. ఈ చట్టం ప్రకారం మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకుని వేలం వేయొచ్చు. ప్రస్తుతం బ్యాంక్ లకు మాల్యా బకాయిపడ్డ మొత్తం కన్నా నాలుగున్నరవేలకోట్ల రూపాయల ఆస్తులు కేంద్రం దర్జాగా తమఖాతాలో వేసుకునే అవకాశం వుంది. దాంతో విజయ మాల్యా వన్ టైం సెటిల్ మెంట్ కి బ్యాంక్ లను ఒప్పించేందుకు తన బృందాన్ని రంగంలోకి దింపి చర్చలు మొదలు పెట్టించారు.ఈ చర్చలు ఫలిస్తే కట్టాలిసిన సొమ్ములో కొంత డిస్కౌంట్ తోబాటు నాలుగున్నరవేలకోట్ల రూపాయలు మిగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్ధిక నిపుణులు. అందుకే ఇండియా వచ్చి లెక్కలు తేల్చుకుని మిగిలిన సొమ్ము జేబులో వేసుకోవాలన్నది మాల్యా ప్లాన్ అంటున్నారు. అదే జరిగితే అటు లిక్కర్ కింగ్ ఇటు కేంద్ర సర్కార్ కి ఉభయతారకమే. మాల్యా ను తెచ్చి దేశం ముందు నిలబెట్టి డబ్బు కక్కించామని సర్కార్ చెప్పుకుంటే, సెటిల్ చేసుకుని మిగిలిన డబ్బు పోకుండా జాగ్రత్త పడ్డానని లిక్కర్ కింగ్ సంబర పడొచ్చు. అందుకే ఆర్ధర్ జైలు సినిమా సెట్టింగ్ లా సిద్ధం అయిపోతుంది మరి.

Related Posts