బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అనిపించుకున్న హీరో ఎవరంటే అమీర్ ఖాన్. ఈ దంగల్ హీరో ఎప్పట్నుంచో మహాభారతం తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ సంభందించి ఆయన స్టార్స్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అయితే ఆ మహాభారతంలో ఒక లీడ్ క్యారక్టర్ కోసం మన బాహుబలి ప్రభాస్‌ను అమీర్ కన్సల్ట్ అయ్యాడనే విషయం ఇప్పుడు ఫిలిం ఇండష్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. ఆ డిటేల్స్ ఏంటో ఇప్పడు చూద్దాం.మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలంగా `మహాభారతం 3డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ అంబానీతో కలిసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం సిరీస్‌ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు నుంచి ఐదు భాగాలుగా తెరకెక్కించేందుకు తనకు ఏకంగా పదేళ్ల సమయం పడుతుందని ప్రకటించాడు అమిర్ ఖాన్. ఆ క్రమంలోనే ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయమై ఆసక్తికర చర్చ సాగింది. అమీర్ ఖాన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే వంటి స్టార్లను సంప్రదించారన్న చర్చ సాగింది. అమీర్ కృష్ణుడిగా నటిస్తే దీపిక పదుకొనే ద్రౌపది పాత్ర పోషించనుందని ప్రచారమైంది. ఇప్పుడు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో అర్జునుడు పాత్రలో నటిస్తాడని బాలీవుడ్ సర్కిల్ తెగ ప్రచారం జరుగుతుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ ఫారెన్ ఇండష్ట్రీస్ నుంచి కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. ఆ క్రేజ్ న దృష్టిలో పెట్టుకోని ఇప్పటికే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాహుబలి ప్రభాస్‌ని సంప్రదించాడని తెగ రూమర్స్ వినిపిస్తున్నయి. వాస్తవానికి కొంతకాలంగా అమిర్ తెరకెక్కించే మహాభారతం తెరకెక్కుతుందా.. లేదా? అన్న సందిగ్ధత నెలకొందని వార్తలొచ్చాయి.సహజంగానే పురాణేతిహాసాలు తెరకెక్కించేప్పుడు ఎన్నో చిక్కులుంటాయి. `పద్మావతి` తెరకెక్కించేప్పుడు భన్సాలీకి ఎదురైనట్టే.. సేమ్ సన్నివేశమే రిపీటైతే అది పెద్ద రిస్క్ అవుతుందని భావించి అమీర్ సైలెంటుగా ఉన్నారని ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్టర్ పెర్ఫెక్ట్ ఈ ప్రాజెక్టు విషయమై రాజీకొచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఆ క్రమంలోనే కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ బిజీగా ఉన్నారని ప్రభాస్ దగ్గరకు కూడా ప్రపోజల్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే ఇంతవరకు ప్రభాస్ నోటిస్కు అమీర్ నుంచి ఎటువంటి ప్రపోజల్ రాలేదని..ఇవన్నిరూమర్స్ మాత్రమే అని వారు కొట్టిపారేశారు.