YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు రసీదులు

సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు రసీదులు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ జిల్లా అంతటా ఉత్కంఠ వాతావరాణాన్ని నెలకొల్పుతోంది. ప్రభుత్వ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రశీదు ఇచ్చే విధా నం జిల్లాలో తొలిసారిగా అమల్లోకి రానుంది. ఓటరుకు రశీదు ఇచ్చే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు మొదటిసారిగా రశీదు పరికరాలను అమర్చనున్నారు. అయితే ఈ వీవీప్యాట్‌ మిషన్లు అర్బన్‌ ఏరియాలో 1400 ఓటర్లను, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లను మాత్రమే నమోదు చేసుకొని ఓటరుకు రశీదులు ఇవ్వగలుగుతాయి.ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా వచ్చినా.. షెడ్యూల్‌ ప్రకారం వచ్చినా.. ఎన్నికల సంఘం నిర్వహణకు సిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితా రూప కల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినా గడువులోగా పూర్తి చేయడంతో పాటు ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంల వినియోగం, తదితర ఏర్పాట్లపై ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఈసారి జరబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కొత్తగా ‘వీవీ ప్యాట్‌’ లు వినియోగించనున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీవీప్యాట్‌లను వినియోగించడం ఇదే మొదటిసారి.జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 1,78,715 ఓటర్లు ఉండగా, బోథ్‌ నియోజకవర్గంలో 1,73,915 మంది ఓటర్లు ఉన్నారు.ఈ ప్రక్రియ ద్వారా జిల్లా వ్యాప్తంగా 45 పోలింగ్‌ కేంద్రాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పట్టణంలోని ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 1400 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకోగా,  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 1200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉండకుండా   పోలింగ్‌ కేంద్రాలను రేషనలైజేషన్‌ చేశారు.ఈ లెక్కన జిల్లాలో 518 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక జిల్లాలో ఈసారి జరబోయే ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌లను వినియోగించనున్నారు. ఈ వీవీప్యాట్‌లు జిల్లాలోని అన్ని ఈవీఎంలకు అనుసంధానం చేసి వినియోగించనున్నారు. ఒక్కో ఈవీఎంకు ఒకో వీవీప్యాట్‌ మిషన్‌ వినియోగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంకా ఈవీఎంల పునర్విభజన జరగలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,333 ఈవీఎం మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈవీఎంల పునర్విభజన జరిగిన తర్వాత ఇతర జిల్లాలకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌ మిషన్లను అందించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16,333 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. అంతే మోతాదులో ఓటరు రశీదు పరికరాలు  సిద్ధం చేస్తున్నారు. ఆ మిషన్‌లో అన్ని ఓటర్లకు మాత్రమే సరిపడా ప్రింటింగ్‌ పేపర్‌ అందుబాటులో ఉంటుంది.  ఉదాహరణకు... ఒక వ్యక్తి ఓటు వేయడానికి ఈవీఎం మిషన్‌ దగ్గరకు వెళ్లాడనుకుందాం.. అతను ఈవీ ఎంపై సదరు గుర్తు గల బటన్‌పై ప్రెస్‌ చేస్తారు.. ఏ గుర్తుకు అయితే మనం ఓటేశామో మరుక్షణం ఆ గుర్తు ఏడు సెకండ్ల పాటు వీవీ ప్యాట్‌ మిషన్‌లో రశీదు రూపంలో కన్పించి కింద ఉన్న బాక్సులో పడిపోతుంది. ఆ రశీదును మనం తీసుకునేం దుకు వీలుండదు కానీ.. ఓటు ఏ గుర్తుకు వేశామో నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఓటర్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలు పనిచేయకపోతే వీవీప్యాట్‌ రశీదులను బ్యాలెట్‌ బాక్సులుగా లెక్కగట్టి కౌంటింగ్‌ చేస్తారు.

Related Posts