వరంగల్ జిల్లాలో దోమల ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధులు వస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మలేరియా, పైౖలేరియా బాధితులూ అధికంగా ఉన్నట్లు తేల్చారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్ తోట, చింతల్, హన్మకొండలోని రాంనగర్, జవహర్‌నగర్‌కాలనీల్లోనూ పిల్లలు, వృద్ధులు రోగాలతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజూ 20 నుంచి 50 మంది జ్వర పీడితులు వస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటి ముందు చూసినా మురుగు కాలువలు, వెనకాల నీటి కుంటలు దర్శనమిస్తున్నాయి. వీటిలో దోమల నివారణ మందు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా పంచాయతీ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించడం లేదు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తం చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ వారూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పల్లెల్లో పర్యటించిన దాఖలాలే లేవు. వైద్య శిబిరాలనూ ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి.జనవరి నుంచి ఇప్పటి వరకు 39 డెంగీ కేసులు నమోదు కాగా, హసన్‌పర్తి మండలంలోనే 10 కేసులున్నాయి.కంటి వెలుగు కార్యక్రమంతో సంబంధం లేకుండా ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని వైద్యాధికారులను, హెల్త్ సూపర్‌వైజర్లను ఆదేశించారు వైద్యాధికారులు. జ్వరాలపై సర్వే చేయాలని, రక్త నమూనాలు సేకరించాలని, పరీక్షలు జరపాలని ఆరోగ్య, కార్యక్తలు, ఏఎన్‌ఎంలకు సూచించాను. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నివాసాల్లోని నీటి నిల్వల తొట్టిలను, డ్రమ్ములను శుభ్రం చేసి ఆరబెట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.