దేశంలో ఈ నాటికీ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాకపోవడానికి కారణం క్రిమీ లేయర్. ఓబీసీ ,బీసీ లు ఎంతమంది ఉన్నారు అని ఇప్పటికి అయినా లెక్కించడానికి పూనుకున్నారు. తెలంగాణలో బీసీ ల సంఖ్య ఎక్కువగా ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పాడు. ఈ ఎన్నికలలో బీసీలు కేసీఆర్ ను ఓడించకపోతే తెలంగాణలో దొరల రాజ్యం వస్తుందని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి నివేదన సభకు డబ్బు ఎక్కడిది. కేసీఆర్ కు ఇదే చివరి మీటింగ్. రాహుల్ తెలంగాణ టూర్ లో కాంగ్రెస్ కు కొత్త జోష్ వచ్చింది. యూనివర్సిటీ లో విద్యార్థులు అమాయకులు కాదు. మేము బీసీలము అని చెప్పుకోవడానికి బీసీలు గర్వపడుతున్నారని అయన అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని మేము కోరుకుంటాం. ప్రగతి నివేదన సభకు ఒక్కొక్కరికి 5వేలు ,మందు బిర్యానీ పంపిణీ కి సిద్దం చేస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు కేసీఆర్ మోసం చేసాడు. రిజర్వేషన్ అని మోసం చేసాడు కేసీఆర్. గిరిజనులను అన్నిరకాలుగా మోసం చేసిన కేసీఆర్ అని ధ్వజమెత్తారు. నిజమైన గిరిజన బిడ్డలు కేసీఆర్ సభకు వెళ్లకూడదు. రాహుల్ గాంధీ కుటుంబ పాలనకు ,కేసీఆర్ కుటుంబ పాలనకు నక్కకు నాగలోకనికి ఉన్నంత తేడా ఉంది. రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణాలు వదిలారు. తెలంగాణలో అంత అవినీతి రాజ్యం ఎలుతుందని ఆరోపించారు.