సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం ఆక్సిజన్ సిలిండరు పేలిపోయింది. దాంతో మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో సమాచారం అందుకున్న అగ్నిప్రమాపక సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనతో రోగులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన రోగులందరినీ బయటకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆసుపత్రి నుండి బయటకు రావడానికి రోగులు ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఎమర్జెన్సీ పేషంట్ లను వేరే ఆసుపత్రి కి తరలించారు అధికారులు. సంఘటన స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ప్రమాదం ఎందుకు జరిగింది అని సిబ్బంది అడిగి తెలుసుకున్నారు