YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వైద్య సేవలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

వైద్య సేవలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు పాల్గోన్నారు.  మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అధికారులను ముఖ్యమంత్రి  అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల నియంత్రణ విషయం లో అధికారులు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసారు. డెంగ్యూ కేసులు పెరగడాన్ని తీవ్రంగా భావిస్తున్నాను. శాఖకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నా సమర్ధవంతంగా నియంత్రించలేకపోతున్నారు. నిర్లక్ష్యం కనిపిస్తోంది, సున్నితమైన ప్రాంతాలు, ఎక్కడ ఈ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి అన్న విషయంలో శ్రద్ధ కనిపించడం లేదని అయన అన్నారు. విశాఖ, గుంటూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు కనిపిస్తున్నాయి ఎటువంటి చర్యలు తీసుకున్నారు. గత ఏడాది వ్యాధులు ప్రబలిన ప్రాంతాలు, ఈ ఏడాది వచ్చిన ప్రాంతాలు బేరీజు వేసుకోకుండా వ్యాధులను ఎలా అంచనా వేస్తారు, ఎలా నియంత్రిస్తారు. ఇలాగ ఉంటె సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు,  కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పరిస్థితి దిగజారకుండా అప్రమత్తంగా ఉండాలి , సోమవారం వరకు చూస్తాను. తర్వాత వ్యాధులు నియంత్రణలోకి రాకపోతే కఠిన నిర్ణయాలు తప్పవు. ఆ తర్వాత నేనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాను . ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. హాట్ స్పాట్ లను గుర్తించారా, గుర్తించి చర్యలు తీసుకోపోతే  ఎందుకు వ్యాధి ఇంకా ప్రబలుతోందని అయన అన్నారు. గత ఏడాది కన్నా డెంగ్యూ కేసులు రాష్ట్రంలో పెరిగాయి, ఈ మొదటి 25 వారాల్లో 1196 కేసులు నమోదయ్యాయి. ఒక్క గుంటూరు, విశాఖ, అనంతపురం జిల్లాల్లోనే 86 శాతం కేసులు ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ  వంటి వ్యాధులు కొత్తవేమీ కాదు... అయినా అధికారులు ఇంకా సమర్థవంతంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అయన ప్రశ్నించారు.

Related Posts