నరేగాలో ఏపీకి 10 అవార్డులు రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016-17లో 5 అవార్డులు వచ్చాయి,2017-18లో 10అవార్డులు వచ్చాయి.ఈ ఏడాది 20 అవార్డులు సాధించాలి. ఏటికేడు రెట్టింపు అవార్డులు, రెట్టింపు ప్రగతికి నిదర్శనమని అన్నారు. పారదర్శకత,జవాబుదారీ తనం,ఉపాధి హామీ అనుసందానం,సుపరిపాలనలో,ఎక్కువ పనులు చేయడంలో అవార్డులు వచ్చాయి.దేశంలో అత్యత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలుగా విశాఖ,ప్రకాశం వచ్చాయి. ఈ ఘనతకు కారణమైన అందరికీ అభినందనలు. ఈ స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలి.ఇంకా మరింతగా పురోగతి సాధించాలని సూచించారు.
వర్షపు నీటిని భూగర్భజలంగా మార్చే బృహత్తర కార్యక్రమం చేపట్టాం.రాయలసీమ,నెల్లూరు,ప్రకాశం జిల్లాలలో తీవ్ర వర్షాభావం ఉంది. 45% నుంచి 60% వర్షపాత లోటు ఉంది. 86రిజర్వాయర్లలో 67% నీరు చేరడం సంతోషంగా ఉంది.651టిఎంసిల నీరు చేరింది,ఇంకా 310టిఎంసీలకు అవకాశం ఉంది. శ్రీశైలంలో 7టిఎంసిలు, నాగార్జున సాగర్ లో 7టిఎంసీలు, పులిచింతలలో 29టిఎంసిల నీరు చేరాల్సివుంది. మూడు రిజర్వాయర్లకు ఇంకా 43టిఎంసిలు రావాలి.. వర్షం పడినా, పడకున్నా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల విస్తీర్ణం 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలి. రాష్ట్రంలో 2కోట్ల ఎకరాల్లో సాగునీటి సదుపాయం కల్పించాలి. ఇప్పటివరకు 96% విస్తీర్ణంలో పంటలు వేశారు. ఏ సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. భూగర్భ జలాలు,ఉపరితల జలాలు,వర్షపు నీరు సమర్ధ నిర్వహణ జరగాలి.వర్షాలు లేని చోట అన్ని చెరువులను నీటితో నింపాలి. రెయిన్ గన్స్ ద్వారా పంటలు ఎండకుండా కాపాడాలి. కరవు వచ్చినా, వరదలు వచ్చినా నీటి సమర్ధ నిర్వహణ జరగాలి. విపత్తులలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. కరవు మండలాల్లో నరేగా