YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమీషన్లకు కేరాఫ్ కాంగ్రెస్ : మంత్రి తలసాని

కమీషన్లకు కేరాఫ్  కాంగ్రెస్  : మంత్రి తలసాని

ప్రగతి నివేదన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. .ఈ సభలో సీఎం కెసిఆర్ తమను ఎక్కువగా తిడుతారని కాంగ్రెస్ నేతలు ఆశపడ్డట్టున్నారు. కాంగ్రెస్ నేతలు తమను తిట్టలేదని నిరుత్సాహ పడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. .పేరు లోనే ప్రగతి నివేదన సభ ఉంది. .నాలుగేళ్ల లో సాధించిన ప్రగతి ని కెసిఆర్ విడమరిచి చెప్పారు. కాంగ్రెస్ నేతలు కళ్ళుండి చూడ లేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు కంటి వెలుగు శిబిరాల్లో ఓ సారి పరీక్షించుకుంటే మంచిది. .ఉత్తమ్ కు దేవుడు బుద్ది జ్ఞానం ప్రసాదించాలి. ఆయన మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ హాయంలో సభలకు ఆర్టీసీ బస్సులు పెట్టలేదా ? ఆర్టీసీ లోనే ఆ ప్రొవిజన్ ఉన్న విషయం మంత్రులు గా పని చేసిన కాంగ్రెస్ నేతలకు తెలియదా అని అయన అడిగారు. ఏదేదో మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య కు సొంత ఊరి లోనే పరపతి లేదు. .దేవాదుల నీళ్లు జనగామ కు వచ్చాయా లేదా ? కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ. మిషన్ భగీరథ పై ఉత్తమ్ అబద్దాలు మాట్లాడుతున్నారని అయన ఆరొపించారు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందడం లేదా ? ఫీజు రీయంబర్సు మెంట్ మీ హాయం లో ఎంత ఇచ్చారు మా హాయంలో ఎంత ఇచ్చామో తేల్చుకుందామా ఉత్తమ్ అని సవాలు విసిరారు. కాంగ్రెస్ హాయంలో కరెంటు ఎందుకు సరిగా ఇవ్వలేక పోయారో చెబుతారా ? కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోవాలి. .కాంగ్రెస్ నేతల కంటే మేము ఎక్కువగా మాట్లాడ గలం. కెసిఆర్ చేసింది చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది. సభలో అన్ని మాట్లాడటం కుదురుతుందా ? మేము కేంద్రం తో రిజెర్వేషన్ల పై ఏం మాట్లాడామో అన్ని కాంగ్రెస్ నేతలకు చెబుతామా అని అడిగారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ పై కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కార్యాలయాల కు వెళ్లి వివరాలు తెచ్చుకుంటే బాగుంటుంది. .కెసిఆర్ హటావో అని కాంగ్రెస్ నేతలు బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. కెసిఆర్ హటావో అంటే కాంగ్రెస్ కు అధికారం వస్తుందా ? నా 25 యేళ్ళ రాజకీయ జీవితం లో ప్రగతి నివేదన సభ లాంటి దాన్ని చూడలేదు. జనం తండోప తండాలు గా వచ్చారు. వేరే పార్టీ వాళ్ళు సభలు పెట్టుకుంటే ప్రభుత్వం వద్దంటుందా ? .హన్మంత రావు ను వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకోరు ..మా మీద  మాట్లాడుతున్నారు. .డబ్బు సంచులతో అడ్డంగా దొరికి పోయిన దొంగ కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. .ప్రజలు కాంగ్రెస్ నేతల భాష చూసి చీదరించుకుంటున్నారు. .కాంగ్రెస్ నేతలకు సభలన్నా భయమే ...ముందస్తు ఎన్నికలన్నా భయమే. .ఎడాపెడా హామీలిస్తున్న కాంగ్రెస్ నేతల మొహాలకు అధికారంలో ఉండగా వాటిని అమలు చేయాలన్న బుద్ది రాలేదు ? .ఉద్యోగాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారం లో ఉండగా ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు ? గ్రెస్ హాయం లో ఆ పార్టీ నేతలే బాగుపడ్డారు. ప్రజలే కేంద్రబిందువుగా మేము పాలిస్తున్నాం ...కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టు మేము పాలించాలా ? కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ లో సంక్షేమం బాగా అమలవుతోంది. .తెలంగాణ లో ప్రజల కోసమే అప్పు చేస్తున్నాం. .కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని దైర్యంగా చెప్పగలరా ? అని అడిగారు. న్నాల మూర్ఖుడిగా మాట్లాడుతున్నారు. .కాంగ్రెస్ లో ఉన్నముగ్గురు  నలుగురు నేతలు తెలంగాణ లో ఎందుకు పుట్టారో అని ప్రజలు చర్చించు కుంటున్నారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో ప్రగతి నివేదన సభ రైళ్లు పరిగెత్తించింది. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ . .ప్రగతి నివేదన సభ సందర్భంగానే ప్రజలు మందు తాగుతున్నారా ?అంతకు ముందు తాగడం లేదా ? ముందస్తు ఎన్నికలు అని మేము అధికారికంగా చెప్పామా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముందస్తు ,వెనకస్తూ ఏదీ వచ్చినా తెరాస దే విజయమని తలసాని అన్నారు.

Related Posts