YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లెక్కలు బయటపెట్టాలి : ఉండవల్లి అరుణ్ కుమార్

లెక్కలు బయటపెట్టాలి : ఉండవల్లి అరుణ్ కుమార్
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై అనేకులు నన్ను సంప్రదిస్తున్నారు. ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారు. మరోవైపు  ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం నాడు అయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. పేద ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలి పేదల ఆర్థిక స్థితిగతులు మార్చాలి. అనేక కండిషన్ ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి పరిస్థితి దేశంలో ఎక్కడా లేని వడ్డీలు ఇక్కడ వసూలు చేస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి దగ్గర పని చేసిన వారిని జైలు  లో పెట్టించమన్నారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటి. ఇప్పుడు బాబు హయాంలో ఇస్తున్న కేటాయింపులు ఏంటని అయన ప్రశ్నించారు. రోజు మార్కెట్లో రాష్ట్రం విలువ తగ్గుతుంది. నాలుగేళ్ళలో లక్షా 30వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారు బాబు అని అయన అడిగారు. కరప్షన్ చేసి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని బాబు చెప్పారు. నంద్యాల ఎన్నికల్లో బాబు అదే మాట ఒప్పుకున్నారు. వ్యాపారం రాష్ట్ర పాలన ఒకే మాదిరిగా ఉండకూడదని పాస్కల్ చెప్పారు. బాబు చేస్తున్న వ్యాపారాన్ని స్వీట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారు. చంద్రబాబు నిజాలు చెప్పి పాలన చేయగలరా. వారానికి ఓసారి ఖర్చుపెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని  ఉండవల్లి నిలదీసారు. కనీసం ఈ తొమ్మిది నెలల్లో అయినా ఖర్చు పెట్టిన లెక్కలు చెప్పండని అన్నారు.  బాండ్లు ద్వారా తీసుకున్న  2వేల కోట్ల  అప్పుకు ప్రతి మూడు నెలలకూ  10 రూపాయల 36 పైసలు అధిక వడ్డీ చెల్లించాలి. అమరావతి బాండ్ల లో  బ్రోకర్ కు  17 కోట్ల రూపాయలు  ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న  పారదర్శకతా  అని అన్నారు. అప్పు ఇచ్చేవాడు  దొరికినా చంద్రబాబు  ప్రచారం  చేసుకుంటున్నారు  . అమరావతి  బాండ్లు కొన్న  తొమ్మిది మంది  పేర్లు  చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టాలని అయన డిమాండ్ చేసారు. అధిక వడ్డీకి  అప్పులు తీసుకోవద్దంటూ ఏడు  నెలల క్రితమే  చంద్రబాబు ప్రభుత్వం జి.వొ. జారీచేసింది. నాలుగేళ్లలో   చేసిన  లక్ష  30 వేల కోట్ల రూపాయల అప్పును  చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది. పారదర్శకత  లో  అవార్డ్  తీసుకున్న  చంద్రబాబు కనీసం  వారం రోజులుకైనా  ప్రభుత్వం లెక్కలు  ప్రజలకు  చెప్పాలని అయన అన్నారు. 

Related Posts