తిరుపతి నగరం ప్లాస్టిక్ రహితం చేస్తామని చిత్తురు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో మూడురోజుల పాటు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో తిరుపతి నగరం నుండి ప్లాస్టిక్ నిషేదం ప్రారంభంకావడం మంచి ప్రయత్నమని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ప్లాస్టిక్ నిషేదం పై పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టిన్నా వ్యాపారాస్తుల కోరిక మేరకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు పై పలు అవకాలు , వస్తువులను నగరపాలక సంస్థ ఎగ్జిబిషన్ రూపంలో నగరప్రజలకు వ్యాపారులకు అవకాశం కల్పించిందని అన్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థ అందరి సహకారంతో తిరుపతి నగరం పలు సార్లు అవార్డులందుకున్నదని ప్లాస్టిక్ నిషేదంతో రానున్న రోజుల్లో మరింత ఉన్నత ర్యాంకులు అందుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.