YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాఫెల్ వ్యవహారంపై అందోళనలు : ఏపీసీసీ

రాఫెల్ వ్యవహారంపై అందోళనలు : ఏపీసీసీ
రాఫెల్ కుంభకోణం దేశంలో అతిపెద్ద కుంభకోణం. 500 కోట్లతో కొనుగోలు చెయ్యాల్సిన ఒక  యుద్ధ విమానానికి 1600 కోట్లు ఖర్చు పెట్టారు.  రాఫెల్ కుంభకోణంకు సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.  సోమ వారం అయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా 10వతేదీన అన్ని జిల్లా కలక్టరేట్ల వద్ద ఆందోళనలు చేస్తామని అయన అన్నారు. 24వ తేదీన రాష్ట్ర నాయకత్వం మొత్తం విజయవాడ వేదికగా నిరసన కార్యక్రమం వుంటుంది. ఆ రోజు న గవర్నర్ ఆంద్రప్రదేశ్ కు రావాలని అయన అన్నారు.  పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్దే అని  రఘువీరా  అన్నారు. ఇంకో 20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా కనిపించడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల ఫలాలు పోలవరం నిర్వాసితులకు అందడంలేదని ఆరోపించారు. 

Related Posts