తెరాస ప్రగతి నివేదిక సభ అట్టర్ ప్లాప్ గా జరిగింది. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రేయేట్ చేశారు. హౌస్ ఫూల్.. కలెక్షన్ నిల్ గా నిలిచింది. మొత్తానికి కేసీఆర్ ఆవేదన సభగా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల శంఖారావం లాగా, తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రజల ఆదరణ పొందని సభ ఇది. ట్విట్టర్ లో స్పందించినంత ఈజీ కాదు సభలు నిర్వహుంచడం అనేది. ధనబలం, అధికార మదం, ప్రజాధనం దుర్వినియోగం చేశారని అయన ఆరోపించారు. ప్రజలను తరలించే విషయంలో వందల కోట్లు ఖర్చుపెట్టారు తప్ప ప్రజలను సమీకరించలేదు. సీఎం మాటలలో బలం లోపించింది ఒక దశ దిశ లేదు. తాను మాట్లాడేటప్పడు మంత్రుల ముఖం లో నెత్తురు చుక్కలేదు. నిన్నటి సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేరకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని అయన అన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చుకున్నారు తప్ప ఒరిగిందేమిలేదు. ముందస్తు కు వెళ్తే ముందస్తు ఓటమి తప్పదని అయన వ్యాఖ్యానించారు.