YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేలవంగా సాగిన సభ : ఎల్.రమణ

 పేలవంగా సాగిన సభ : ఎల్.రమణ
కేసీఆర్ నిన్నటి సభ కోసం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అధికారం చేపట్టి 51 నెలలు అయ్యింది. తను ఏం చేశాడో స్పష్టంగా చెప్తాడనుకున్నారు అందరూ.  కాని ఎక్కడా దాని మీద స్పష్టత లేదు. 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్వహించిన సభ పేలవంగా సాగిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. మభ్యపెట్టడం తప్పితే ఎక్కడా స్పష్టత కనిపించలేదు. 5 లక్షల లోనే జనాలు వచ్చారు. ప్రజలను గంగదరగోళంలో ఉంచి, మభ్యపెట్టి ఎలా అధికారంలోకి వచ్చాడో తిరిగి అలాగే అధికారం సంసాదించాలని కేసీఆర్ చూస్తున్నాడని అయన అన్నారు. మేము ప్రశ్నించిన ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని సమాధానం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇదేమి ఆయన సొంత ప్రాపర్టీ కాదు. కేసీఆర్ పరిపాలనలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా పెరిగాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడు. రాష్ట్రంలో 22 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేదని సర్వేలో తేలింది. కాని కేసీఆర్ 10 వేల కన్నా ఎక్కువ కట్టిచలేకపోయాడు. దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు అదీ లేదు. లక్ష 15 వేల ఉద్యోగాలు అన్ని చెప్పి నిరుద్యోగులను విద్యార్ధులను మోసం చేశాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసెంబ్లీలో 1200 మంది అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారని చెప్పిన కేసీఆర్... క్షేత్ర స్థాయిలో మాత్రం అంత మందికి సహాయం చేయలేదని అయన అన్నారు. విభజన చట్టాన్ని కేంద్రం చేత అమలు చేయించడంలో కేసీఆర్ విఫలమయ్యాడు. అక్కడ మోడీకి మోకరిల్లి... ఇక్కడ పెడబొబ్బలు పెడుతూ కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నాడు. 3 లక్షల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. నిన్న కేసీఆర్ నిర్వహించింది ప్రగతి నివేదన సభ కాదు... ప్రజా ఆవేదన సభ అని అయన అన్నారు. 

Related Posts