నాలుగేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించింది ఎమీ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.. నేడిక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేసీఆర్ పెట్టిన ప్రగతి నివేదన సభ లోచెప్పింది ఏమిలేదని అంట గుండు సున్నా అని అన్నారు..సభ లో కెసిఆర్ ఏదో చెప్తారని ఏవో వరారు కురిపిస్తారని ప్రజలు ఆసిన్చారని కాని కిసిఅర్ ప్రసంగం పడిందీ పాడరా పాసుపల్ల దాసరి అన్న చందం లా ఉందని ఏద్దేవ చేసారు.అందుకు ఆయన మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నాలుగేళ్ళ ప్రగతికి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని ఆశించాం.. అటువంటిది ఎమీ జరగలేదని విక్రమార్క అన్నారు. నాలుగేళ్ళ బడ్జెట్ ద్వారా వచ్చిన ఆదాయం..పెట్టిన ఖర్చు.. సృష్టించిన ఆస్తులు, ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన నీళ్లు, వివరాలను ముఖ్యమంత్రి వెల్లడిస్తారని ఆలించానని.. అయితే అటువంటిది జరగలేదని భట్టి అన్నారు.ఈ సభలో కేసీఆర్ తన భజన తాను చేసుకోవడం, మాట ఇస్తే తప్పకూడదు, మాట తప్పితే తల తీసేయండని మరోసారి చెప్పడం మినహా.. కేసీఆర్ చెప్పింది సూన్యం అని విక్రమార్క చెప్పారు. కేసీఆర్ ప్రసంగంలో గతంలో ఇచ్చిన హామీల ప్రస్తావన ఎక్కడ లేదని, ఇక భవిషత్ లో ఏమీ చేస్తారో కూడా చెప్పలేదని భట్టి విమర్శించారు.
తెలంగాణ ప్రజలు.. అమాయకులు వారిని మరోసారి ఏదో జరుగుతోంది.. కేసీఆర్ ఏదో చేస్తున్నాడనే భ్రమలు కల్పించి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తురని అన్నారు.సభకు రైతులు, రైతు కూలీలు వచ్చారు అన్నారు.. కానీ చివరకు ఖాలీ ట్రాక్టర్లు వచ్చాయి.. ఎక్కడ ఒక్క రైతు కానీ రైతు కూలీ కానీ ట్రాక్టర్ ఎక్కి సభకు రాలేదని భట్టి చెప్పారు.ప్రగతి నివేదన సభ పేరుతో వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసారని విక్రమార్క విమర్శించారు.ఈ సభ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను విచ్చలవిడిగా ఉపయోగించారని అన్నారు. చివరగా ఈ పాలకుల ప్రజస్వామ్యాన్ని అపహా చేసారని అన్నారు.