YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

2-వీలర్ బీమా తెలుగు వెబ్‌సైట్ ప్రారంభించిన పాలసీబజార్

2-వీలర్ బీమా  తెలుగు వెబ్‌సైట్ ప్రారంభించిన పాలసీబజార్
 భారతదేశపు ప్రముఖ ఇన్సూర్‌టెక్ సంస్థ మరియు అతిపెద్ద బీమా మార్కెట్ స్థలం అయిన పాలసీబజార్ ఇప్పుడు 2-వీలర్ వినియోగదారుల సౌలభ్యం కోసం తెలుగు వెబ్‌సైట్ ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ నగరాల్లోని స్థానిక భాషలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో పరిశోధించి కొనుగోలు చేసే వినియోగదారులకు సహాయపడేందుకు ఈ వెబ్‌సైట్ ప్రారంభిచినట్లు పాలసీబజార్ జనరల్ ఇన్సూరెన్స్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తరుణ్ మాథూర్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ''తమ వాహనానికి రక్షణ కల్పించాలనుకునే యజమానులు ఏ తరహా బీమాను కొంటే బాగుంటుంది అనేది తెలుసుకోవడం చాలా అవసరం, దీనిని వారు తమ స్వంత భాషలో చదివితే మరింత సులభంగా అర్థం చేసుకోగలరని మేము భావిస్తున్నామన్నారు. ఈ బహుభాషా కార్యక్రమం కేవలం ఆయా స్థానిక భారతీయ భాషల వినియోగదారుల సౌకర్యార్థం మోటారు బీమా సంబంధిత కథనాలను వారి స్వంత భాషలో అందుబాటులో ఉంచి వారు సులభంగా అర్థం చేసుకోగలిగేలా చేయడమే కాకుండా, ద్వి చక్ర వాహనాల బీమాను కొనుగోలు చేసిన ఒక సంవత్సరం తర్వాత పునరుద్దరింపబడక మురిగిపోయే సమస్యను ఎదుర్కొంటున్న మార్కెట్లలోకి చొచ్చుకుపోయేలా మాకు సహాయపడుతుంది'' అన్నారు.పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, దేశంలోని 2-వీలర్ యజమానుల్లో 12 మిలియన్ల యజమానులు తెలుగు రాష్ఠ్రాల్లోనే ఉన్నారు. వీరిలో పలువురు తెలుగులోనే బ్రౌజ్ చేసి ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఈ కారణంతోనే వెబ్ సైట్  ఇంటర్‌ఫేజ్ ఏర్పాటు చేసింది. తద్వారా తన మార్కెట్ విస్తరణకు ఇది సుగమం కాగలదని విశ్వసిస్తోంది.తాజా కెపిఎంజి-గూగుల్ అధ్యయనం ప్రకారం, స్థానిక భాషా కంటెంట్, ఇంగ్లీషు భాషలోని కంటెంట్ కన్నా మరింత విశ్వసనీయంగా ఉంటుందని భారతదేశంలో ఇంటర్నెట్ ఉపయోగించే వివిధ స్థానిక భాషల ప్రజలు భావిస్తున్నారు. 2021 నాటికి, భారతదేశంలో స్థానిక భాషల్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం చెప్పుకోదగిన రీతిలో పెరుగుతుంది, అంతే కాకుండా దేశంలో తెలుగులో ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య 31 మిలియన్లకు చేరుకుంటుంది.

Related Posts