YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఐటీ హబ్‌గా అమరావతి: కేఈ కృష్ణమూర్తి

ఐటీ హబ్‌గా అమరావతి: కేఈ కృష్ణమూర్తి
ఐటీ హబ్‌గా అమరావతి మరబోతుందని  ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, మంత్రి లోకేశ్‌ చొరవే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మ్యాక్స్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి పుల్లారావుతో కలిసి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు కొనకళ్ల నారాయణ, గోకరాజు గంగరాజు, ఆప్కో ఛైర్మన్ హనుమంతరావు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐటీ సలహాదారు రవికుమార్, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 90 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని, ప్రస్తుతం ఐటీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఎక్కడో విదేశాల్లో కంటే మన ప్రాంతంలోనే ఐటీ ఉద్యోగాలు లభిస్తే ఆ సంతృప్తే వేరని అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరమని మంత్రి పుల్లారావు అన్నారు. అమరావతి, పోలవరం, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని... మరో ఐదేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. అమరావతి త్వరలోనే మరో సైబరాబాద్, బెంగళూరు కానుందని పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts