టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ పగటి దొంగల ప్రజా నివేదిక సభ అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి.. వ్యాఖ్యానించారు. మోదీకి సలాం చేస్తోంది.. గులాం గిరి చేస్తోంది కేసీఆరే అని అన్నారు. జోన్ల విషయంలో మోదీని నిలదీసిన కేసీఆర్.. మైనార్టీల రిజర్వేషన్ ఇస్తావా.. చస్తావా.. అని మోదీని ఎందుకు నిలదీయలేని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి అసులువులుబాసిన ఎంతమంది అమరుల కుటుంబాలకు సాయం చేశావో చర్చకు వస్తావా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాజకీయ అధికారం కావాలా గులాబీ నేతలకు గులాంగిరీ చేస్తారా అనేది బీసీలు తేల్చుకోవాలన్నారు. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే అంత మంచిదని ప్రజలు కూడా భావిస్తున్నారని మధుయాష్కి పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారంతా ఓడిపోయారని గతాన్ని గుర్తుచేశారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్‌పైనా మధుయాష్కి ఫైర్ అయ్యారు. కేటీఆర్ అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.