YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తాను చనిపోతే ఏంచేయాలన్న దానిపై హార్దిక్ పటేల్ వీలునామా

తాను చనిపోతే ఏంచేయాలన్న దానిపై హార్దిక్ పటేల్ వీలునామా
పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేపట్టిన ఆమరణ దీక్ష నేటితో పదిరోజులు పూర్తిచేసుకుంది. దీంతో నిరాహార దీక్షలో తాను చనిపోతే ఏంచేయాలన్న దానిపై హార్దిక్ పటేల్ తన వీలునామా ప్రకటించారు.2015కోటా ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన14మంది యువకుల కుటుంబాలకు తన సొమ్ములో వాటా కేటాయించారు. ఇంత జరుగుతున్నా ఆయన దీక్షపై గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.హార్దిక్ బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.50 వేలు ఉండగా.. అందులో రూ.20 వేలు తన తల్లిదండ్రులకు ఇవ్వాలనీ... మిగతా డబ్బు తన స్వగ్రామం వీరంగంలో గోశాల నిర్మించేందుకు ఇవ్వాలని రాశారు. పటేల్ కారు, బీమా సొమ్ము, తన బయోగ్రఫీ  హు టుక్ మై జాబ్ ప్రస్తుతం ప్రచురణలో ఉంది) ద్వారా వచ్చే రాయల్టీ సొమ్మును కూడా మూడు భాగాలుగా చేశారు. అందులో15 శాతం తల్లిదండ్రులు భరత్‌భాయ్, ఉషాబెన్‌లకు 15 శాతం సోదరి మోనికాకు, మిగతా భాగం 2015 ఉద్యమంలో చనిపోయిన14 మంది యువకుల కుటుంబాలకు ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నారు. తన నేత్రాలను కూడా దానం చేస్తున్నట్టు ప్రకటించారు.కాగా హార్దిక పటేల్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్టు పటీదార్ అనామత్ ఆందోళన్ నేత మనోజ్ పనారా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో హార్దిక్ మాట్లాడడం సాధ్యం కాదు. దీంతో ఇప్పుడే ఆయన తన విల్లును ప్రకటించారు.అని ఆయన పేర్కొన్నారు. పటీదార్ వర్గానికి ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ కేటాయించాలంటూ గత నెల 25నుంచి హార్దిక్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఆమాద్మీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆయనకు మద్దతుగా నిలిచాయి.

Related Posts