గత కొంత కాలంగా కథానాయిక శ్రుతి హాసన్ సినిమాలలో కనిపించని సంగతి విదితమే. డిమాండ్ వున్నప్పటికీ అమ్మడు సినిమాలు చేయడం లేదు. దీనిపై శ్రుతి తాజాగా స్పందించింది. 'కావాలనే సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ సమయంలో ఎంతో తెలుసుకున్నాను. నన్ను నేను అర్థం చేసుకునే అవకాశం కూడా కలిగింది. త్వరలోనే మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకుని, మీ మధ్యకు వస్తాను' అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.