టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత తొలి సారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “యూ టర్న్”. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్‌కు సిద్దమైంది. ఆ విశేషాలు ఇప్పడు చూద్దాం.మహానటి చిత్రంలో జరలిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న సమంత మరోసారి యూ టర్న్ కోసం జర్నలిస్ట్‌గా మారింది. ఇది సమంత కెరీర్ లోనే లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ. ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ హిందీ రైట్స్ కోసం 2.10 కోట్లు చెల్లించారని తెలిసింది. ఇది యువ హీరోల సినిమాకు ఇచ్చే మొత్తం కన్నా చాలా ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం సమంతే అని సమాచారం. వరుసగా ఆమె సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కురిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాకూడా అత్యధిక కలక్షన్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగులో నిర్మాతలకు విడుదలకు ముందే లాభాలను తీసుకొచ్చింది. దాదాపు 5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క రెండు తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను 6కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శివమ్ సెల్యులాయిడ్ దక్కించుకుంది.. ఇక సమంత కు వున్నఇమేజ్ దృష్ట్యా శాటిలైట్ హక్కుల రూపంలో కూడా ఈచిత్రానికి మంచి ప్రాఫిట్ రానుంది. పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా ముఖ్య పాత్రల్లో నటించారు.ఇప్పటికే రిలీజైన ప్రోమోస్‌తో మంచి బజ్ తెచ్చుకుంది. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో సమంత ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.