బెజవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య మరో మైలు రాయిని దాటింది. ప్రస్తుతం నెలకు లక్ష మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు 3,300 మంది ప్రయాణికులు.. 52 సర్వీసుల్లో దేశంలోని ఎనిమిది నగరాలకు వెళ్లి వస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని విమానాశ్రయమైన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ సమకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విమాన రాకపోకలకు అత్యంత కీలకంగా మారిన విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్దిపై ఎపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో మారిన అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు తగినట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలాగా ఇస్తాంబుల్ తరహాలో ఒక ఆధునిక టవర్ బిల్డింగ్ నిర్మించనున్నారు. అయితే ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఉపయోగించే ఈ సూపర్ టవర్ ను ఎయిర్ పోర్టులో ఓ పక్కన కాకుండా ప్రస్తుతం ఉన్న రన్‌వేకు...నూతనంగా నిర్మిస్తున్న మరో రన్‌వేకు మధ్య భాగంలో నిర్మించనున్నట్లు సమాచారం.మూడేళ్ల కిందటి వరకూ చూసుకున్నా.. రోజుకు వెయ్యి మంది.. నెలకు 30 వేల మంది మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం అనూహ్య రీతిలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇక్కడి డిమాండ్‌ను గుర్తించిన విమానయాన సంస్థలు సైతం దేశీయ సర్వీసులను నడిపేందుకు పోటీ పడుతూ.. టిక్కెట్ల ధరలను సైతం అందుబాటులోనికి తీసుకొస్తున్నాయి. దేశంలోని ఎనిమిది నగరాలకు నడుస్తున్న విమాన సర్వీసులన్నీ.. 70శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. గన్నవరం నుంచి విమాన సర్వీసులను ఏ నగరానికైనా నడిపితే ప్రయాణికులు ఉంటారా.. అనే సందేహం మూడేళ్ల కిందటి వరకూ ఉండేది. ఒక్కో విమానయాన సంస్థ ముందుకొచ్చి.. సర్వీసులను ప్రారంభిస్తుంటే.. అనూహ్యమైన స్పందన కనిపిస్తూ వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా ఏ నగరానికైనా సర్వీసులను ఇక్కడి నుంచి నడపొచ్చనే దీమా విమానయాన సంస్థల్లో వచ్చింది. మార్చి నుంచి ప్రతినెలా లక్ష.. 2018 మార్చి నుంచి ప్రతి నెలా ప్రయాణికులు లక్ష మందికి పైగా ఉంటున్నారు. గత ఆరు నెలల్లో విమానాశ్రయం నుంచి ఆరు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఏడాది మొత్తంలో తొమ్మిది లక్షల మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆరు లక్షలున్నారు. ఈ సంఖ్య వచ్చే ఆరు నెలల్లో మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాలకు అత్యధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయంగా విజయవాడ నుంచి గోవా, కేరళ, అహ్మదాబాద్ సహా అనేక ప్రాంతాలకు ఇంకా సర్వీసులు ప్రారంభమవ్వలేదు. ఇక్కడి నుంచి దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటికీ డిమాండ్ భారీగా ఉంటోంది. విమానయాన సంస్థలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సర్వీసులను ప్రారంభిస్తే.. ప్రయాణికుల వృద్ధి మరింత గణనీయంగా ఉంటుంది. మరో వైపు గన్నవరం కేంద్రంగా అక్టోబర్ 01 నుంచి భారీ ఎయిర్‌బస్ సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఏటీఆర్ సర్వీసులను మాత్రమే ఇండిగో నడుపుతోంది. వీటిలో 72మంది మాత్రమే ప్రయాణికులు పడతారు. కొత్తగా తీసుకొచ్చే ఎయిర్‌బస్‌లో 180మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు.
25 కోట్లతో సూపర్ టవర్
విమానాశ్రయం మధ్యలో వీకేఆర్ కాలేజీ వైపు ఏర్పాటు చేసే ఈ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సూపర్ టవర్ లో విమానాశ్రయానికి సంబంధించి ఆధునిక సాంకేతిక వ్యవస్థ అంతా పొందుపరుస్తారని తెలిసింది. ఇదే విధంగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో రన్‌వే మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టవర్ బిల్డింగ్‌లో ఆర్కిటెక్చర్ నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. విజయవాడలోని సూపర్ టవర్ ఆ స్థాయిలో కాకపోయినా...అదే తరహా టవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సూపర్ టవర్...ప్రత్యేకతలు రూ.25 కోట్ల అంచనాతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ సూపర్ టవర్ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరు అంతస్థులుండే ఈ టవర్ బిల్డింగ్ పొడవు 100 అడుగుల పొడవు ఉంటుందని తెలిసింది. ఈ బిల్డింగ్ పై భాగంలో టవర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో పాత టెర్మినల్ దగ్గర ఏటీసీ టవర్ బిల్డింగ్ ఉండగా దీనికి పశ్చిమ దిశన రన్‌వే ఉంటుంది. అయితే ఆధునిక ప్రమాణాల దృష్ట్యా ఎయిర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే రన్‌వే మధ్య భాగంలో ఏటీసీ టవర్ బిల్డింగ్ ఏర్పాటు శ్రేయస్కరంగా నిపుణులు భావిస్తున్నారు. రన్‌వే రెండు వైపులా ఈ టవర్ కనిపించటానికి వీలుగా ఒక పక్కన దీన్ని నిర్మించాలి. దీనిపై నుంచి చూస్తే విమానం ల్యాండింగ్, టేకాఫ్ ల వంటివి స్పష్టం గా కనిపించేలా తీర్చిదిద్దనున్నారు. ఈ క్రమంలో కొత్త టవర్ బిల్డింగ్ డిజైన్లకు ప్రక్రియ ప్రారంభం కాగా వీటిల్లో ఒక దానిని కేంద్రం ఆమోదించాల్సిఉంటుంది. క్రీడా వార్తలు ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా సఫారీ మాజీ ఆటగాడు టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్ భారత్‌తో సిరిస్: టెస్టు క్రికెట్ ఇంకా బతికే ఉందన్న జో రూట్ ఫైర్ ఫైటర్లు...కొనుగోలు ఇదిలావుండగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఇటీవలే ఆస్ట్రియా దేశం నుంచి అత్యంత శక్తివంతమైన రెండు ఫైర్ ఫైటర్లను ఒక్కొక్కటీ రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. టేకాఫ్, ల్యాండింగ్‌లో రన్‌వేపై ప్రమాదం జరిగితే రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుంటాయి. ఆ సామర్థ్యం ఈ ఫైర్ ఫైటర్ల సొంతం.