వరుసగా పదో రోజు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో వాహనదారుల జేబులు చిల్లులు పడుతున్నాయి. దేశ రాజధానిలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 79.31, డీజిల్ ధర రూ. 71.34కు పెరిగింది. సోమవారం నాటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. ఇక ధరలు అధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 86.72, డీజిల్ రూ. 75.74 పలికింది.ఇక లీటర్ పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ. 82.33, చెన్నైలో రూ. 82.41, హైదరాబాద్‌లో రూ. 84.09గా ఉంది. లీటర్ డీజిల్ ధర కోల్‌కతాలో రూ. 74.29, చెన్నైలో రూ. 75.39, హైదరాబాద్‌లో రూ. 77.60 పలుకుతోంది.డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోండటం, ముడిచమురు ధర భారీగా పెరగడం వల్ల గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. ఇక ఇరాన్‌పై అమెరికా విధించే ఆంక్షల కారణంగా ముడిచమురు సరఫరా తగ్గుతుందన్నభయాలు కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ ధరల పెరుగుదలతో సామాన్యుల గుండెలు గుబేలుమంటున్నాయి.