YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తీరాన్ని తవ్వేస్తున్నారు

తీరాన్ని తవ్వేస్తున్నారు
జిల్లాలోని సముద్ర తీరంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీంతో పెనుముప్పు పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. ఓ వైపు ప్రకృతి ప్రకోపంతో సముద్ర తీరం కోతకు గురవు తుండగా..మరోవైపు కొందరు స్వార్థపరులు ఇసుక తవ్వకాల కోసం పెద్దఎత్తున అగాథాలు సృష్టిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా జరుగుతున్న ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాలు, సముద్రం పక్కనుంచే తువ్వ ఇసుకను తరలిస్తున్న తీరు తీర ప్రాంత ప్రజలను కలవరపెడుతోంది.
జిల్లాలో అంతర్వేది నుంచి యానాం వరకు సముద్ర తీరాన్ని ఆనుకుని పలు చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. దీనికితోడు తీరానికి రక్షణగా ఉన్న సరుగుడు తోటలు, గాలుల నుంచి రక్షణ కల్పించే తాటిచెట్లు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతర్వేది నుంచి 28 కిలోమీటర్ల మేర తీర గ్రామాల్లో సీఆర్‌జడ్‌ పరిధికి మించి సముద్ర జలాల వరకు తవ్వకాలకు పాల్పడుతున్నారు.దీనికితోడు ప్రస్తుతం తీరాన్ని ఆనుకునే ఆక్వా చెరువుల తవ్వకాలు చేపడుతున్నారు. చెరువుల తవ్వకాల్లో తీసిన తువ్వ ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారు. సముద్ర తీరంలో సీఆర్‌జడ్‌ పరిధిలో కూడా అక్రమంగా రొయ్యల చెరువులు వెలుస్తున్నాయి. అంతర్వేదికర, కేశవదాసుపాలెం, గొల్లపాలెం, చింతలమోరి తదితర గ్రామాల్లో సముద్రం ఒడ్డున ఎత్తుగా ఉండే ఇసుక దిబ్బలు అక్రమార్కుల స్వార్ధానికి కరిగిపోతున్నాయి. తీరంలో లోతుగా ఇసుకను తవ్వేసి సొమ్ము చేసుకోవడంతో పాటు ఆక్వా చెరువులను ఏర్పాటు చేసి రొయ్యల సాగు చేపడుతున్నారు.మలికిపురం మండలంలో గొల్లపాలెం, తూర్పుపాలెం, శంకరగుప్తం, చింతలమోరి తీర గ్రామాల్లో యథేచ్ఛగా ఆక్వా సాగు కొనసాగుతోంది. తీరంలో నిబంధనలను తుంగలోకి తొక్కి ఇటీవల సుమారు 200 ఎకరాల్లో చెరువులు ఏర్పాటు చేసి రొయ్యలు సాగు చేస్తున్నారు.
శంకరగుప్తం, చింతలమోరిలో కూడా గత ఆరు నెలల్లో సొసైటీ భూములు, జిరాయితీ భూముల్లో కూడా ఇసుక తవ్వకాలు, చెరువుల ఏర్పాటు జోరుగా సాగుతోంది. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది దేవస్థానం, పల్లిపాలెం తీర గ్రామాల్లో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం ఇక్కడి నుంచి ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీరంలో ఎస్సీ సొసైటీ భూములు ఉన్నాయి. వీటికి ఎదురుగా పెరుగు భూములు ఏర్పాటయ్యాయి. వాటిని కూడా విడిచిపెట్టకుండా అందులోనూ తవ్వకాలు చేపడుతున్నారు. సొసైటీ భూముల్లో ఇసుకను తవ్వి విక్రయించుకోవడంతో పాటు చెరువులను కూడా ఏర్పాటు చేసి లీజుకు ఇస్తున్నారు. ఇలా రూ.లక్షలు చేతులుమారుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. కేశవదాసుపాలెం, అంతర్వేదిలో ఇసుక తవ్వకాలు, చెరువుల ఏర్పాటుపై కన్నెర్ర చేసిన గ్రామస్థులు తవ్వకాలను అడ్డుకున్నా అక్రమార్కుల దందాతో వారు మిన్నకుండిపోయారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లోని ఎస్సీ సొసైటీల అధ్యక్షులు, బాధ్యులతో రెవెన్యూ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా సముద్ర తీరాన సీఆర్‌జెడ్‌ పరిధిలో చెరువులు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం లేదు.
తీరంలో అక్రమంగా సాగుతున్న ఇసుక తవ్వకాలు, ఆక్వా సాగుపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సరుగుడు, తాటిచెట్లు కనుమరుగై పోతుండటంతో తీరం నుంచి వచ్చే బలమైన గాలులను అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు తువ్వ ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తుండటంతో తీర భూములకు మరింత ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితిలో జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి సముద్ర తీరంలో అక్రమంగా ఇఉక తవ్వకాలతో పాటు ఆక్వా చెరువుల ఏర్పాటును అడ్డుకోవాల్సిన అవసరముంది.ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీరంలో ఎస్సీ సొసైటీ భూములు ఉన్నాయి. వీటికి ఎదురుగా పెరుగు భూములు ఏర్పాటయ్యాయి. వాటిని కూడా విడిచిపెట్టకుండా అందులోనూ తవ్వకాలు చేపడుతున్నారు. సొసైటీ భూముల్లో ఇసుకను తవ్వి విక్రయించుకోవడంతో పాటు చెరువులను కూడా ఏర్పాటు చేసి లీజుకు ఇస్తున్నారు. ఇలా రూ.లక్షలు చేతులుమారుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. కేశవదాసుపాలెం, అంతర్వేదిలో ఇసుక తవ్వకాలు, చెరువుల ఏర్పాటుపై కన్నెర్ర చేసిన గ్రామస్థులు తవ్వకాలను అడ్డుకున్నా అక్రమార్కుల దందాతో వారు మిన్నకుండిపోయారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లోని ఎస్సీ సొసైటీల అధ్యక్షులు, బాధ్యులతో రెవెన్యూ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా సముద్ర తీరాన సీఆర్‌జడ్‌ పరిధిలో చెరువులు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం లేదు.

Related Posts