YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

150 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

150 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
క్రితం సెష‌న్ లాగే.. నేడు కూడా చివర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 155 పాయింట్లు క్షీణించి 38,158కు చేరగా... నిఫ్టీ 62 పాయింట్లు పతనమై 11,520 వద్ద నిలిచింది. చైనా, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు, అర్జెంటీనా సంక్షోభం, రూపాయి పతనం వంటి అంశాలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయడంతో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇవే అంశాల కారణంగా సోమవారం చివర్లో అనూహ్యంగా తలెత్తిన భారీ అమ్మకాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోపక్క యూరప్‌, ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు అమ్మకాలతో తిరోగమించాయి. సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవుకాగా.. నేడు ట్రేడింగ్‌ ప్రారంభం కానుంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఇన్ఫీ(2.64%), టీసీఎస్‌(1.86%), విప్రో(1.42%), యాక్సిస్ బ్యాంక్(0.97%), రిల‌య‌న్స్(0.97%) లాభాల్లో ఉండ‌గా, మ‌రో వైపు ఏసియ‌న్ పెయింట్స్(3.49%), ఎస్‌బీఐఎన్(3.20%), అదానీ పోర్ట్స్(2.95%), హెచ్‌యూఎల్(2.80%), కోల్ ఇండియా(2.61%), ఇండ‌స్ఇండ్ బ్యాంక్(2.36%) న‌ష్ట‌పోయాయి

Related Posts