కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు కొండ్రు మురళి సైకిల్ ఎక్కనున్నారు. ఈ నెల 6న మురళి సైకిల్ ఎక్కేందుకు ముహూర్తం ఖరారయ్యింది. కాంగ్రెస్ ఆపేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మురళి మాత్రం అభివృద్ధిని కాంక్షిస్తూ ఏపీ ని ప్రగతి పధంలో నడిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న టిడిపీ రథ సారధి చంద్రబాబు విధానాలకు ఆకర్షితుడై పార్టీ మారి పసుపు కండువా కప్పుకోబోతున్నారు. కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు.మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు కొండ్రు మురళీమోహన్ ఈ నెల 6న టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆగస్టు 31నే కొండ్రు టీడీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందటంతో చేరిక వాయిదా పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాధ కలిగించిందన్న మురళి.. కష్టకాలంలో తనతో ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నప్పటి నుంచి తన నిజయోకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశమవుతున్న కొండ్రు.. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. తనకు ఇప్పటి వరకు సహకరించినట్టుగానే ఇకపై కూడా సహకరించాలని కోరారు. మురళి తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా టీడీపీలో చేరనున్నారు.