భారత క్రికెట్ బోర్డు బీసీసీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ సస్పెన్షన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం బీసీసీఐని ఆదేశించింది. అయితే 2013లో జరిగిన ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే ఆ తరువాత అతడు నిర్దోషి అని తేల్చినప్పటికీ.. బీసీసీఐ నిర్వహించే ఏ క్రికెట్ ఆటలలోనూ అతను పాల్గొనకూడదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోకి సమాధానం చెప్పాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసింది.