YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హరికృష్ణ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్

హరికృష్ణ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్

 

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ఏడాదిలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖులు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను బాలయ్య ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త సంచలనమవుతోంది. ఈ సినిమాలో పలానా క్యారెక్టర్‌లో వాళ్లు నటిస్తున్నారు.. వీళ్లు నటిస్తున్నారు అంటూ మీడియాలో హడావిడి చేస్తుండడంతో ఈ సినిమాకు ఊహించని ప్రచారం దొరుకుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.నందమూరి తారక రామారావు జీవితంలో చాలా మంది కీలక వ్యక్తులు ఉన్నారు. ఆయన కుమారుల్లో ఎక్కువ మెలిగింది మాత్రం దివంగత నేత హరికృష్ణ అనే చాలా మంది చెబుతారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తి కూడా హరికృష్ణే. చైతన్య రథం పేరుతో ఒక వాహనం ఎక్కి నేరుగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తెలుగు రాజకీయాలను ఎన్టీఆర్‌ ఒక మలుపు తిప్పారు. చైతన్య రథయాత్రలో సుదీర్ఘ కాలంపాటు ఆయనకు సారథిగా హరికృష్ణ పనిచేశారు. దాదాపు లక్ష కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపిన హరికృష్ణ తండ్రి చాటు బిడ్డలా ఉండేవారు. ఆయనంటే ఎంత ప్రేమ ఉండేదో, అంతే భయం కూడా ఉండేది. లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత తండ్రినే ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బావ చంద్రబాబుతో కలిసి, తండ్రిని విభేదించారు. ఇలాంటి ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న హరికృష్ణ పాత్రను ‘ఎన్టీఆర్’లో చూపించాలని అనుకున్నారు. అందకోసం ఆయన రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ డేట్లు కూడా తీసుకున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో కథలో కొన్ని మార్పులు చేయాలని డిసైడ్ అయిందట చిత్ర బృందం. హరికృష్ణ పాత్రను పెంచబోతున్నారని తెలుస్తోంది.

Related Posts