YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

ఖాప్ పంచాయతీలపై సుప్రీం ఆగ్రహం

ఖాప్ పంచాయతీలపై సుప్రీం ఆగ్రహం

- ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపేస్తారా..?

- ఆ హక్కు మీకెక్కడిది? అధికారం ఎవరిచ్చారు?..

ఖాప్ పంచాయతీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నించింది. పరువు పేరిట హత్యలు చేయించే అధికారం ఎక్కడిది అని మండిపడింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను ఆ ఖాప్‌ల బారి నుంచి కాపాడేందుకు కఠినమైన చట్టాలను చేయాలని కేంద్రాన్ని కోరింది. ‘‘మీకుమీరే అంతరాత్మ పరిరక్షకులు అనుకుంటున్నారా?’’ అని మండిపడింది. చట్ట నిషిద్ధ పెళ్లిళ్లను రద్దు చేసేందుకు కోర్టులున్నాయని, చట్టాలున్నాయని, అలాంటప్పుడు ఖాప్‌లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటే అది చట్ట సంబద్ధమా.. చట్ట విరుద్ధమా అన్నది తేల్చాల్సింది కోర్టులని, అంతేగానీ పెళ్లి చేసుకున్న వారిపై హింసను ప్రేరేపించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కులాంతర, మతాంతర, విశ్వాసాలకు అతీతంగా పెళ్లి చేసుకునే జంటలకు రక్షణ కల్పించే దిశగా ఉన్నతస్థాయి పోలీస్ కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఆ కమిటీ.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను ఖాప్ పంచాయతీల తీర్పులు, తల్లిదండ్రులు, బంధువుల బారి నుంచి కాపాడాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. 

Related Posts