YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దసరా ఉత్సవాలకు సన్నద్దం కండి ఉపముఖ్యమంత్రి కే.ఈ కృష్ణమూర్తి

దసరా ఉత్సవాలకు సన్నద్దం కండి         ఉపముఖ్యమంత్రి కే.ఈ కృష్ణమూర్తి
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొవాలని ఉపముఖ్యమంత్రి ,దేవాదాయ శాఖ మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి ఆదేశించారు. దుర్గగుడి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు, దసరా సంధర్భంగా  చేస్తున్న ఏర్పాట్లు గురించి దుర్గగుడిఈవో కోటేశ్వరమ్మ ని అడిగి తెలుసుకున్నారు.  ఈ సంవత్సరం దసరా పండుగలో ఒక ప్రత్యేకత వుంది. దసరా పర్వదినాన ఒకే రోజు రెండు  అలంకారాలు ఏర్పాటు చేయాలి. ఉదయాన మహిషాసుర మర్ధని, మధ్యాహ్నం రాజరాజేశ్వరి అలంకరణ చేయాల్సి వుంటుంది. అలంకరణ మార్చే సమయంలో 11 గంటల నుంచి 1 గంట వరకు భక్తుల దర్శనం నిలిపి వేయాల్సి వుంటుందని  ఈవో ఉపముఖ్యమంత్రిగారి ద్రుష్టికి తీసుకొచ్చారు. ఉదయం 3 గంట నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.దసరా రోజున భక్తుల రద్దీ ఎక్కువుగా వుంటుంది. అమ్మవారి అలంకరణ మార్పు కోసం  రెండు గంటల పాటు దర్శనం నిలిపివేస్తున్న విషయాన్ని  ప్రసారమాధ్యమాల ద్వారా విస్త్రుత ప్రచారం చేసి సామాన్య భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా పాలు, మంచి నీరు అందించాలన్నారు. సామాన్య భక్తులకు దర్శనాలకు ఆటకం లేకుండా వి.ఐ.పి.లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందు కోసం అర్జున వీధిలో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాజమార్గంలోని లిప్ట్ దగ్గర ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసి , వచ్చిన విఐపిలు వెయిట్ చేయకుండా దర్శనం సులువుగా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ.వో ఉపముఖ్యమంత్రిగారి ద్రుష్టికి తీసుకొచ్చారు.  ప్రస్తుతం వున్న ప్రసాదాలకు అదనంగా అప్పం ప్రేవేశపెట్టాలని నిర్ణయించామని, ఇందుకు బోర్డు కూడా అనుమతించిందన్నారు. ఉత్సవాల రోజుల్లో  దేవాలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదంగా కదంబం అందిస్తామన్నారు.దసరా ఉత్సవాల సంధర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకోవడంతో పాటు జనరేటర్లు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం దేవాలయంలో వైద్యం అందిస్తున్న డాక్టర్లకు తోడు ప్రత్యేకంగా దేవాలయం చుటు ప్రక్కల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రధ్ద పెట్టాలన్నారు.  ఉత్సవాల సంధర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయించేందుకు  దేవాదాయ శాఖ సిబ్బంది తో పాటు  స్వఛ్చంధ  సేవా సంస్ధలు, విధ్యార్ధుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

Related Posts