YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టిడిపి లోకి జూనియర్ ఎన్టీఆర్?

టిడిపి లోకి జూనియర్ ఎన్టీఆర్?
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచనలో ఏపి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది.రానున్న ఎన్నికలు టీడీపీకి చావోరేవో తేల్చేవి కావటం.. బలమైన విపక్షం ఉన్న నేపథ్యంలో జూనియర్ ను తమ వైపునకు ఉంచుకుంటే ఎన్నికల ప్రచారానికి తరుపు ముక్కగా మారతారన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో హరికృష్ణను బాబు దూరం పెట్టిన వైనం తెలిసిందే. ఇటీవల జరిగిన మహానాడుకు ఆయనకు ఆహ్వానం కూడా పంపని విషయం తెలిసిందే. దీంతో.. బాబు.. హరికృష్ణ మధ్య దూరం పెరిగిందని చెబుతారు. అవసరానికి వాడుకొని వదిలేస్తున్న  బాబు తీరుపై తారక్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతారు. ఇదిలా ఉంటే.. అనుకోని రీతిలో మరణించిన హరికృష్ణతో విషాదంలో మునిగిన కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి మరీ అంతిమసంస్కారాల్ని నిర్వహించారు.హరికృష్ణ ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వని బాబు.. మరణించిన తర్వాత మాత్రం భారీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. అంత్యక్రియలు జరిగే వరకూ నిత్యం రెండు..మూడుసార్లు జూనియర్ ఎన్టీఆర్ (తారక్)తో మాట్లాడేవారని.. సలహాలు.. సూచనలు చేసేవారని.. అంత్యక్రియల్ని ఆయనే దగ్గరుండి చేయించినట్లుగా తెలుస్తోంది.హరికృష్ణతో తనకున్న విభేదాలకు చెక్ పెట్టేలా బాబు తాజా అడుగులు ఉన్నాయని చెబుతున్నారు. అంత్యక్రియల దగ్గర నుంచి పలు సందర్భాల్లో చంద్రబాబు ముందుండి కార్యక్రమాన్ని నడిపించటం చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవటం ద్వారా నందమూరి కుటుంబం టీడీపీతో కలిసి ఉందన్న భావన కలిగేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఈ అంశంపై బాబు నిర్ణయం తీసుకొని.. ఎన్టీఆర్ ను పాలిట్ బ్యూరోకి రమ్మంటే ఎన్టీఆర్ వచ్చే పరిస్థితి ఉందన్న మాట పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు పార్టీలోకి రావాలన్న ఆలోచనలో లేరన్న మాట వినిపిస్తోంది. గతంలో ఒకసారి వచ్చి దెబ్బ తిన్నానని.. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆలోచిద్దామని  అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి ఎన్టీఆర్ కారణంగా లాభం చేకూరుతుందన్న విషయం తారక్ కు అవగాహన ఉంటే బెట్టు చేసే వీలుందని అంటున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ పై టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోందని చెప్పక తప్పదు. 

Related Posts