- కళ్ళను కాపాడుకుందాం-
- ఇది కంటికి సంబంధించిన ఆరోగ్య సూత్రం.
- 20-20-20 సూత్రమంటే..
- ప్రతి 20 నిముషాలకు ఒక్కసారి. కనీసం 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా వస్తువుని. కనీసం 20 సెకన్ల పాటు చూడాలి.
- సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిన ప్రస్తుత సామాజిక నేపథ్యంలో, ఈ కంటి సూత్రానికి కూడా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది.
- మన కళ్ళు మన ప్రమేయం లేకుండానే నిముషానికి 15 పర్యాయాలు కొట్టుకుంటాయి. సెల్ ఫోన్ని తదేక ద్రృష్టితో చూడడం కారణంగా కళ్ళు కొట్టుకోవడం 7 కి పడిపోయింది.
- కళ్ళు 15సార్లు కొట్టుకుంటేనే కంటి ఆరోగ్యం బాగుంటుంది. 7 సార్లు కొట్టుకుంటే కళ్ళు దెబ్బ తింటాయ.దీంతో కళ్ళ మీద వత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది.
ఫలితం.. ద్రృష్టిలోపాలు.,తలనొప్పులు.,కళ్ళ మంటలు.
కంటి వత్తిడిని తగ్గించు కోలేమా?
ఎందుకు తగ్గించుకోలేము. తగ్గించాలి అని అనుకుంటే తగ్గించలేనిదేమి కాదు.
ఎలా తగ్గించుకోవాలి..
కంప్యూటర్ని గాని, టీవీని గాని, సెల్‌ఫోన్ని గాని వాడేటప్పుడు
* ప్రతీ 20 నిముషాలకు అంతరాయం కల్గించుకోవాలి
* అది సాధ్యం కాని పరిస్థితుల్లో 20 నిముషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు కళ్ళను మూసుకోవాలి.
ఇది కూడా సాధ్యం కాకపోతే ప్రతి 20 నిముషాలకు 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా ఒక వస్తువు పై 20 సెకన్ల పాటు ద్రృష్టిని మళ్లీంచుకోవాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో 20-20-20 సూత్రాన్ని తప్పక ఆచరణలో పెడదాం.కళ్ళని కాపాడుకుందాం.