YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

700 పోస్టులకు 10 లక్షల మంది దరఖాస్తులు

700 పోస్టులకు 10 లక్షల మంది దరఖాస్తులు
వీఆర్వో పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ.. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేసిన వారు సైతం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకుగాను 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ.. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం విశేషం. దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ విద్యార్హత ఉన్నవారు 4.49 లక్షలు కాగా, ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారు 4.17 లక్షల మంది ఉన్నారు. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు 1.51లక్షల మంది ఉండగా.. పీహెచ్‌డీ చేసినవారు 372 మంది, ఎంఫిల్‌ చేసినవారు 539 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచి అత్యధికంగా 1,56,856 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,56,096 దరఖాస్తులతో మహబూబ్‌నగర్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ జిల్లా నుంచి తక్కువగా 47,059 దరఖాస్తులు వచ్చాయి. వేరే రాష్ట్రాలకు చెందినవారు 14,042 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబరు 16న వీఆర్వో రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నాలుగేళ్లయినా ఆ హామీ నెరవేర్చలేదని, 2.5 లక్షల నిరుద్యోగులకు కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 20 వేల ఉద్యోగాలతో భారీ డీఎస్సీ వేస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు.

Related Posts