YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికారుల చిట్టా సీఎం ముందు విప్పుతా: జేసీ

అధికారుల చిట్టా సీఎం ముందు విప్పుతా: జేసీ
పోలీసులు, అధికారులపై అనంతపురంపార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసు పేరుతో నేరస్తులకు దండంపెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడంటూ తీవ్రంగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు.
జిల్లాలో పోలీసు వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జేసీ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి జేసీ అనేక ఆరోపణలు చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయాయని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందుంచుతానని చెప్పారు. ఈ క్రమంలో మీడియాను జేసీ వదిలిపెట్టలేదు. అనంతపురంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లుమూసుకొని కూర్చున్నారంటూ మండిపడ్డారు 

Related Posts