ఇరవై ఏళ్ల క్రితం రజనీకాంత్, మీనా జంటగా నటించిన 'ముత్తు' చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా జపాన్ లో కూడా బాగా ఆడింది. రజనీకాంత్ కు అప్పట్లో జపాన్ లో అభిమాన గణాన్ని కూడా సంపాదించిపెట్టింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నవంబర్ 23 న జపనీస్ డబ్బింగ్ వెర్షన్ అక్కడ రిలీజవుతుంది.