- కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నిర్వాహకం
సినీహీరోలకే కాదు రాజకీయ నేతలకు కూడా అభిమానులు ఉంటారు. హీరోలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎలా ఆరాటపడతారో అలాగే మంత్రిగారితో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని తెగ ఆరాటపడ్డాడు. కొన్నిసార్లు వారి ప్రయత్నాలు విఫలమవుతుంటాయి.బళ్లారిలో మంత్రిగారితో సెల్ఫీ దిగేందుకు ముచ్చడపడిన ఓ అభిమానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బళ్లారికి వచ్చారు.అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రిగారి అభిమాని ఒకరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు తెగ ఆరాటపడ్డాడు. తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు అభిమాని యత్నించాడు. ఇంకేముంది మంత్రిగారికి కోపం వచ్చింది. ఒక్కసారిగా మంత్రి ఆ అభిమాని ఫోన్‌ను దూరంగా విసిరికొట్టేశారు. అక్కడే ఉన్న మరో అభిమాని మాత్రం సెల్ఫీ కాకుండా చేయి ముందుకు ఇవ్వగా మంత్రిగారు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.