రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాజమండ్రిలో అయన మీడియాతో మాట్లాడారు. రాజా ఆఫ్ కరెప్షన్ బుక్ పై కుటుంబరావు చేసిన బహిరంగ చర్చ సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ కుటుంబరావు టిడిపి. అధికార ప్రతినిధిగా మారారు. చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే నేను ఆయనను ఎందుకు కలుస్తాను . వెటకారంగా మాట్లాడటం గోదావరి జిల్లాల వారి నైజం . వైఎస్. అవినీతి కి పాల్పడలేదని నేనెప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించార. వైఎస్ మనీ టేకింగ్ చేశాడు తప్ప మనీ మేకింగ్ చెయ్యలేదు. మార్గదర్శి వ్యవహారాన్ని నేను వదిలెయ్యలేదు. త్వరలో మరికొన్ని వాస్తవాలు బయటపెడతానని అయన అన్నారు.