YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వయోజనుల మధ్య శృంగారాన్ని నేరంగా పరిగణించాలి లేకపోతే సామాజికంగా సమస్యలు: సుబ్రహ్మణ్యస్వామి

 వయోజనుల మధ్య శృంగారాన్ని నేరంగా పరిగణించాలి         లేకపోతే సామాజికంగా సమస్యలు: సుబ్రహ్మణ్యస్వామి
పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల మధ్య శృంగారాన్ని నేరంగా పరిగణించకపోతే సామాజికంగా సమస్యలు ఎదురవుతాయని భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. లైంగిక వ్యాధుల సంక్రమణలు ఎక్కువైపోతాయని అన్నారు. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన చారిత్రక తీర్పుపై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి వ్యక్తంచేస్తూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కం అనేది జన్యుపరమైన లోపం అని స్వామి పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇక హెచ్‌ఐవీ కేసులు పెరిగిపోతాయని అన్నారు. గే బార్స్‌ కూడా ఎక్కువైపోతాయని తెలిపారు.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించొద్దని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు తీర్పు చెప్పింది. ‘లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపించడం అంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే. ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. సెక్షన్‌ 377 సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తోంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర తీర్పులో వెల్లడించారు.ఇది తుది తీర్పు కాదని, దీనిని మళ్లీ సవాలు చేయొచ్చని పేర్కొన్నారు. ‘ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది తుది తీర్పు కాదు. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో తీర్పు మారిపోవచ్చు’ అని స్వామి తెలిపారు.

Related Posts