YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు వెంటే ! వేమూరి ఆనంద సూర్య

 బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు వెంటే !                  వేమూరి ఆనంద సూర్య
వచ్చే సాధరణఎన్నికల్లో  బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు వెంటే ఉండేలా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నా వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు.కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న13జిల్లాల డీ ఎల్ ఓ లకు నాయకత్వ లక్షణాలు పెంపు పై మంగళగిరి లో రెండు రోజుల శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సమావేశం లో చైర్మన్ మాట్లాడుతూ దేశంలోని మొదటి సారిగా కార్పొరేషన్ పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వం దే అన్నారు.ప్రస్తుతం కార్పొరేషన్ లో పార్లమెంటు కి ఓ డీ ఎల్ ఓ పని చేస్తున్నారు అని త్వరలోనే మండలానికి ఓ మండల మిత్ర ని నియమిస్తాము అన్నారు.వారు ఆ మండలం లోని బ్రాహ్మణ సామాజిక వర్గం ను కలసి కార్పొరేషన్,సొసైటీ కార్యకలాపాలు చెప్పడం, వాటి లబ్దిని పొందేలా దరఖాస్తులు పెట్టించడం చేయాలి అన్నారు.బ్రాహ్మనుడి మెడలో జంధ్యం ఉన్నంత కాలం చంద్రబాబు ను మరిచిపోకూడదు అన్నారు.ఎవరు ఎన్ని చెప్పినా బాబుని ముఖ్యమంత్రి ని చేయదమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.కార్పొరేషన్ పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసేలా డీ ఎల్ ఓ లు పని చేయాలి అన్నారు.అందుకోసమే వారికి ఈ శిక్షణ అన్నారు.కాగా ట్రైనీలు శ్రీపాద రామ్, ఆత్రేయ లు వివిధ అంశాలు పై ఈ శిక్షణ ఇచ్చారు.నాయకుని గా ఎలా ఎదగాలి, విజయం సాధించడానికి ఎలా సాధన చేయాలి తదితర అంశాలు బోధించారు.కార్పొరేషన్ ఎండి , సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం పద్మ కార్పొరేషన్ పధకాల అమలు గురించి ఆరా తీశారు.జనరల్  మేనేజర్లు భవాని శంకర్, వెంకట శాస్త్రి, సొసైటీ సి ఈ ఓ నాగసాయి, డైరెక్టర్ లు సుబ్బారావు, యామిజాల,నాగరాజు, ఓ ఎస్ డి శర్మ,  పి ఆర్ ఓ ఈమని సూర్యనారాయణ, డీ ఎల్ ఓ లు జనార్దన్, గురు రాఘవేంద్ర, కామేష్, డీ హెచ్ వి సాంబశివరావు, కుసుమ, వరలక్ష్మి, కల్యాణి, తదితరులు పాల్గొన్నారుv

Related Posts