YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ప్రభుత్వ సంస్కరణల అమలులో అధికారులు కీలక పాత్ర వహించాలి

 ప్రభుత్వ సంస్కరణల అమలులో అధికారులు  కీలక పాత్ర వహించాలి

- వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలనా ఫలాలు అందుతాయి :

- సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీని విడుదల చేసిన కేటీఆర్

 తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని అన్నారు. పట్టణాల్లో ఇప్పటికే అర్బన్ మిషన్ భగీరథ ద్వారా రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయితీలను నగర పంచాయితీలుగా, మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వీటి ఏర్పాటుతో పాటు నిధులను కూడా ఇస్తామని తెలిపారు. ఇలా వీకేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలనా ఫలాలు అందుతాయని తెలిపారు. జీహెచ్ఎంపీ లోనూ మరిన్ని సర్కిళ్లను, జోన్లను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ సంస్కరణల అమలులో మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలని, కమిషనర్లు తాము పని చేస్తున్న పట్టణాలపైన ప్రత్యేక ముద్ర చాటుకునేలా పనిచేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలసి సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ ఏడాది పలు పథకాలు కీలకమైన దశకు చేరుకున్నాయని, వాటిని పూర్తి చేసే దిశగా పని చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ల ప్రమోషన్లు, ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు కేటీఆర్ చెప్పారు.

Related Posts