తెలుగు..తమిళ బాషలలో ఒకేసారి విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సాధారణ యువకుడిగా .. ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.